త్వరలో రూ. 2,500 కోట్ల ఇండిగో ఐపీఓ !
ముంబై: విమానయాన రంగంలో అత్యధిక మార్కెట్ వాటా ఉన్న ఇండిగో త్వరలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. ఐపీఓకు సంబంధించిన పత్రాలను ఇండిగో సంస్థ మేలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించనున్నట్లు సమాచారం. ఈ ఐపీఓ ద్వారా ఇండిగో సంస్థ రూ.2,500 కోట్లు సమీకరిం చాలని యోచిస్తున్నదని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. 37.1 శాతం మార్కెట్ వాటా ఉన్న ఈ కంపెనీ 91 విమానాలతో రోజుకు 600 విమాన సర్వీసులను నడుపుతోంది. విమానయాన రంగంలో లాభాల్లో ఉన్న రెండు దేశీయ కంపెనీల్లో ఇండిగో ఒకటి. రెండోది గో ఎయిర్ సంస్థ. గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో ఇండిగో రూ.317 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.