కొద్ది నెలలుగా దుమ్ము రేపుతున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధపడుతున్నాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రెండు కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. సోలార్ ఈపీసీ కంపెనీ రేస్ పవర్ ఇన్‌ఫ్రా, సమీకృత ఐటీ సొల్యూషన్లు అందించే ఎస్కోనెట్ టెక్నాలజీస్ తాజాగా సెబీని ఆశ్రయించాయి. ఈ బాటలో ఇన్సులేటెడ్ వైర్లు, స్ట్రిప్స్ తయారీ కంపెనీ డివైన్ పవర్ ఎనర్జీ సైతం స్టాక్ ఎక్ఛ్సెంజీలలో లిస్టింగ్‌పై కన్నేసింది. ఆ వివరాలు చూద్దాం..
రేస్ పవర్ ఇన్‌ఫ్రా
సోలార్ ఈపీసీ కంపెనీ రేస్ పవర్ ఇన్‌ఫ్రా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు ఐపీవోను చేపట్టనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 29.95 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవోకంటే ముందుగానే షేర్ల జారీ లేదా ప్రమోటర్లు 14.97 లక్షల షేర్లను ఆఫర్ చేయడం ద్వారా రూ. 45 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇది జరిగితే ఆమేర ఈక్విటీ జారీ తగ్గనుంది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి. కంపెనీ ప్రధానంగా సోలార్ విభాగంలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్(ఈపీసీ) సరీ్వసులను అందిస్తోంది. 1,207 మెగావాట్ల పీక్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా కంపెనీ దేశీయంగా సోలార్ విభాగంలోని లీడింగ్ కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. గతేడాది(2022–23) మొత్తం ఆదాయం రూ. 891 కోట్లకు చేరగా.. నికర లాభం రూ. 131 కోట్లను అధిగమించింది.
ఎస్కోనెట్ టెక్నాలజీస్
ఐటీ రంగంలో సమీకృత సరీ్వసులందిస్తున్న ఎస్కోనెట్ టెక్నాలజీస్ ఐపీవో ద్వారా నిధుల సమీకరణ ప్రణాళికలకు తెరతీసింది. దీనిలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 33,60,000 షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్‌కానుంది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతోపాటు.. పూర్తి అనుబంధ సంస్థ జీక్లౌడ్ సరీ్వసెస్ విస్తరణ వ్యయాలకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వెచి్చంచనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 2012లో ఏర్పాటైన కంపెనీ హైఎండ్ సూపర్ కంప్యూటింగ్ సొల్యూషన్స్, డేటా సెంటర్ సౌకర్యాలు, స్టోరేజీ సర్వర్లు, నెట్‌వర్క్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ తదితరాలను సమకూర్చుతోంది. గ్లోబల్ దిగ్గజాలు ఏఎండీ, అమెజాన్ వెబ్ సరీ్వసెస్, సిస్కో, డెల్ టెక్నాలజీస్, హెచ్‌పీ, మైక్రోసాఫ్ట్, ఎన్‌విడియా సాంకేతిక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. రక్షణ శాఖ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఐఐటీ, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు క్లయింట్లుగా ఉన్నట్లు తెలియజేసింది.
డివైన్ పవర్ ఎనర్జీ
ఇన్సులేటెడ్ వైర్లు, స్ట్రిప్స్ తయారీ కంపెనీ డివైన్ పవర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. తద్వారా సమకూర్చుకున్న నిధులతో సామర్థ్య విస్తరణ చేపట్టాలని ప్రణాళికలు వేసింది. తాజా పెట్టుబడుల వినియోగంతో 2026కల్లా రూ. 400 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని ఆశిస్తోంది. వెరసి ఈ ఫిబ్రవరి లేదా మార్చికల్లా ఐపీవో చేపట్టే ప్రణాళికల్లో ఉంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో సాగుతోంది. దీంతో 2025కల్లా ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుత రూ. 150 కోట్ల టర్నోవర్‌ను తొలుత రూ. 300 కోట్లకు, ఆపై రూ. 400 కోట్లకు పెంచుకునే ప్రణాళికలు అమలు చేయనుంది. కంపెనీ పేపర్ కవర్డ్, డబుల్ కాటన్ కవర్డ్ కండక్టర్లు, ఫైబర్‌గ్లాస్ ఇన్సులేషన్, సూపర్ ఎనామిల్డ్ ఇన్సులేషన్లను రూపొందిస్తోంది. వీటిని ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు తదితర ఎలక్ట్రికల్ పరికరాలలో వినియోగిస్తారు. ఘజియాబాద్‌లో 40,000 చదరపు అడుగులలో విస్తరించిన తయారీ యూనిట్ ద్వారా రూపొందించిన ప్రొడక్టులను టాటా పవర్, బీఎస్‌ఈఎస్‌సహా పలు ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు అందిస్తోంది. నాల్కో, బాల్కో, హిండాల్కో నుంచి ముడిసరుకులను పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment