రానున్న 4 నెలల్లో రూ.1.48 లక్షల కోట్ల విలువైన 66 కంపెనీల షేర్లకు లాకిన్ గడువు ముగియనుంది. దీంతో ఈ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో భారీగా కంపెనీలు స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. అయితే సెబీ నిబంధనల ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడిపెట్టిన 90 రోజుల వరకు తమ షేర్లను అమ్మేందుకు వీలుండదు. ఆ లాకిన్ గడువు ముగిసిన తర్వాత వాటిని ఈక్విటీ మార్కెట్‌లో విక్రయించవచ్చు.
గడిచిన కొద్దిరోజుల్లో టాటా టెక్నాలజీస్ వంటి ప్రముఖ కంపెనీలు సైతం ఐపీఓగా మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. ఆ ఒక్క కంపెనీ అనే కాకుండా మార్కెట్‌లో పేరున్న చాలా కంపెనీలు మంచి లిస్టింగ్‌గేయిన్స్‌తో స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌అయ్యాయి. ఆ లాభాలంతా 90 రోజుల తర్వాత యాంకర్ ఇన్వెస్టర్ల పొందే వీలుంది.
ఇదీ చదవండి: తగ్గనున్న పారుబాకీలు.. అధిక ఎన్‌పీఏలు ఉన్న రంగాలివే..
లాకిన్ గడువు పూర్తికానున్న షేర్లలో టాటా టెక్నాలజీస్, హోనాసా కన్జూమర్, సెల్లో వరల్డ్, జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఏప్రిల్ 1న గ్లోబల్ సర్ఫేసెస్, సాయి సిల్క్స్, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికామ్ టెక్నాలజీస్ షేర్ల లాకిన్ ముగియనుంది. రానున్న 4 నెలల్లో దాదాపు 66 కంపెనీల లాకిన్ ముగుస్తుంది. దాంతో సుమారు రూ.1.48 లక్షలకోట్ల విలువైన షేర్లపై ప్రభావం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment