పద్నాలుగేళ్ల తర్వాత ఈ నెల(సెప్టెంబర్) సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) వివరాల ప్రకారం సెప్టెంబర్‌లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్‌ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి.
ఫైనాన్షియల్ మార్కెట్లు వృద్ధిలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెప్టెంబర్ బులెటిన్‌లో ఆర్‌బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్‌లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్‌ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌స్క్రైబ్ అవుతున్నట్లు వివరించింది.
ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోల్లో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్‌బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్‌ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment