Equity Investment
-
రూ.1.5 కోట్లు వచ్చాయి.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
ఒక ప్రాపర్టీ అమ్మగా రూ.1.5 కోట్లు వచ్చాయి. వచ్చే 12 ఏళ్ల వరకు వీటితో నాకు అవసరం లేదు. కనుక వీటిని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నేను సహేతుక స్థాయిలో రిస్క్ తీసుకోగలను. ఏ తరహా మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఎంపిక చేసుకోవాలి? రూ.1.5 కోట్లను మొత్తం ఎన్ని నెలల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లించాలి? నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ మాదిరి ఇండెక్స్ ఫండ్స్ ఎంపిక చేసుకోవచ్చా? – రాజన్ప్రాపర్టీ అమ్మగా వచ్చిన రూ.1.5 కోట్లు.. మీ మొత్తం సంపద విలువలో 50–60 శాతంగా ఉంటే కనుక, ఇక్కడి నుంచి మూడేళ్ల కాలంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే మార్కెట్ ఓ పది శాతం మేర పడిపోతే అప్పుడు భావోద్వేగ పరమైన రిస్క్ సులభంగా అధిగమించేందుకు ఇలా చేయాలి. ఒకవేళ మీరు చెప్పిన రూ.1.5 కోట్లు మీ మొత్తం సంపదలో కేవలం 10–15 శాతంగానే ఉంటే అప్పుడు ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో పలు వాయిదాలుగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.12 ఏళ్ల కాలం ఈక్విటీ పెట్టుబడులకు అనుకూలమైనది. కనుక మీ పెట్టుబడుల్లో 20–50 శాతం మేర మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, మైక్రోకాŠయ్ప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే సమయంలో లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు ఎక్కువ మొత్తం కేటాయించుకోవడం వల్ల అనిశ్చిత సమయాల్లో పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వం ఉంటుంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ మంచి ఆప్షన్. ఇది ప్యాసివ్ పథకం.కనుక నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్‌లోని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. యాక్టివ్‌గా పనిచేసే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌ను సైతం పరిగణనలోకి తీసుకోవచ్చు. యాక్టివ్, ప్యాసివ్ ఫండ్స్ మిశ్రమంగా ఉండడం పోర్ట్‌ఫోలియోకి మంచిది. సరైన యాక్టివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం కష్టంగా అనిపిస్తే, అప్పుడు ప్యాసివ్ ఫండ్స్‌కు పరిమితం కావొచ్చు. ఒకే సూచీని అనుసరించి పనిచేసే వివిధ ఇండెక్స్ ఫండ్స్ ఎన్ఏవీల్లో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? – వేణుగోపాల్ఒకే సూచీని అనుసరించి ఇన్వెస్ట్ చేసే వివిధ ఇండెక్స్ ఫండ్స్ అన్ని ఒకేసారి కాకుండా వివిధ సమయాల్లో ప్రారంభమవుతుంటాయి. ఉదాహరణకు 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఇండెక్స్ ఫండ్ ఎన్ఏవీ.. 2022లో ప్రారంభమైన ఇండెక్స్ ఫండ్‌తో పోల్చితే 22 ఏళ్ల కాలం పాటు వృద్ధి చెందుతూ వచ్చింది. కనుక దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఇండెక్స్ ఫండ్స్ ఎన్ఏవీ ఎక్కువగా ఉంటుంది. ఎన్ఏవీ రూ.10 అయినా లేక రూ.100 అయినా ఇండెక్స్ పనితీరు ఆధారంగానే రాబడులు ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఇండెక్స్‌లో ఎంత శాతం మేర మార్పు వచ్చిందన్నదే ముఖ్యంగా చూడాలి కానీ, ఎన్ఏవీ కాదు. సెన్సెక్స్ 10 శాతం పెరిగితే అప్పుడు సెన్సెక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వివిధ ఫండ్స్ ఎన్ఏవీ రూ.10, రూ.100గా ఉన్నప్పటికీ అవి కూడా 10 శాతమే పెరిగి ఉంటాయ్. కనుక ఎన్ఏవీతో సంబంధం లేకుండా ఇండెక్స్ ఆధారితంగా పథకం ఎన్ఏవీలో వృద్ధి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి! -
14 ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ
పద్నాలుగేళ్ల తర్వాత ఈ నెల(సెప్టెంబర్) సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెప్టెంబర్‌లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి.ఫైనాన్షియల్ మార్కెట్లు వృద్ధిలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెప్టెంబర్ బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌స్క్రైబ్ అవుతున్నట్లు వివరించింది. ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోల్లో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
రూ.1,000 పెట్టుబడి రూ.1.36 కోట్లు అయింది!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అంటే ఇప్పటికీ చాలా మంది జంకుతారు. ఎందుకంటే ఇందులో లాభాలతో పాటు నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. కానీ ఓ ఇంజినీరు ఈక్విటీ మార్కెట్లో తన అద్భుతమైన ప్రయాణంతో దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూపించారు.పంజాబ్‌లోని లుధియానాకు చెందిన కుల్దీప్ సింగ్ 1986లో జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ సందర్భంగా రూ.1,000 ఇన్వెస్ట్ చేశారు. స్టాక్ విభజనలు, బోనస్ ఇష్యూల తర్వాత 2024 జూన్ 7న ఆయన పెట్టుబడి విలువ రూ.1.36 కోట్లు అయింది. అప్పట్లో రూ.10 చొప్పున 100 షేర్లు కొనుగోలు చేసినట్లు కుల్దీప్ సింగ్ తెలిపారు.కుల్దీప్ సింగ్ ప్రస్తుతం జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన 7,580 షేర్లను కలిగి ఉండగా, 2024 జూన్ 7న ఒక్కో షేరు విలువ రూ.1,800 వద్ద ముగిసింది. 2017లో పంజాబ్ స్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా పదవీ విరమణ చేసిన ఆయన పోర్ట్‌ఫోలియో విలువ ప్రస్తుతం రూ.4 కోట్లుగా ఉంది. -
ఎయిర్ఏషియాలో టాటాకు 51 శాతం వాటా?
ముంబై, సాక్షి: భాగస్వామ్య సంస్థ ఎయిర్ఏషియా ఇండియాలో టాటా గ్రూప్ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 నేపథ్యంలో కంపెనీకి అత్యవసర ప్రాతిపదికన టటా గ్రూప్ 5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 375 కోట్లు)ను అందించనున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. ఈక్విటీ, రుణాల రూపంలో ఈ నిధులను అందించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశాయి. దీంతో ఎయిర్ఏషియాలో టాటా గ్రూప్ వాటా 51 శాతం ఎగువకు చేరే వీలున్నట్లు పేర్కొన్నాయి. ఎయిర్ఏషియా గ్రూప్‌నకు మలేసియన్ భాగస్వామ్య సంస్థ నిధులను సమకూర్చడానికి విముఖత చూపుతున్న నేపథ్యంలో టాటా గ్రూప్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. భాగస్వామి కోసం ఎయిర్ఏషియా నుంచి మలేషియన్ భాగస్వామి తప్పుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎయిర్ఏషియాలో కొనసాగేందుకే టాటా గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌ఏషియాకు భవిష్యత్‌లో పెట్టుబడులను సమకూర్చగల భాగస్వామి కోసం టాటా గ్రూప్ చూస్తున్నట్లు తెలియజేశాయి. దేశీయంగా విమానయాన రంగానికి సంబంధించి కోవిడ్-19ను పక్కనపెట్టి సాధారణ పరిస్థితులకు అనుగుణంగా టాటా గ్రూప్ ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించాయి. వెరసి మధ్యకాలానికి తిరిగి దేశీ విమానయాన రంగం జోరందుకోనున్నట్లు టాటా గ్రూప్ భావిస్తోంది. అవకాశాలు.. దేశీయంగా చౌక ధరల విమానయానానికి పలు అవకాశాలున్నట్లు టాటా గ్రూప్ అంచనా వేస్తోంది. 30 ఎయిర్‌బస్ A320 విమానాలను కలిగి ఉన్న కంపెనీలో 2,500 మంది విధులు నిర్వహిస్తున్నారు. 600 మంది పైలట్లు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. 2014లో ప్రారంభమైన కంపెనీ ఇంతవరకూ లాభాలు ఆర్జించకపోవడం గమనార్హం! కాగా.. మరోపక్క సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిపి టాటా గ్రూప్ విస్తారాను ఏర్పాటు చేసిన విషయం విదితమే. విస్తారాలో టాటా గ్రూప్ 51 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్ 49 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. ఈ రెండు సంస్థలూ విస్తారాకు ఇటీవల రూ. 585 కోట్ల నిధులను అందజేశాయి. -
షేర్లలో సంపాదించేది కొందరే.. ఎందుకు?!
స్టాక్మార్కెట్లో ఎంతో అధ్యయనం చేసామనుకునేవాళ్లకు సైతం క్రమం తప్పకుండా లాభాలు పొందడం సాధ్యం కాదనేది మార్కెట్ పండితుల మాట. ఇది ఒకరకంగా వాస్తవం కూడా! ఒక అధ్యయనం ప్రకారం 100 మంది షేర్లలో పెట్టుబడులు పెడితే కేవలం 5 శాతం మంది మాత్రమే క్రమం తప్పని సంపాదన ఆర్జిస్తారు. మిగిలిన వాళ్లు క్రమంగా నష్టాలతో ముగిస్తారు. మార్కెట్లో పెట్టుబడికి అందరికీ సమానావకాశలున్నా, కొందరికే ఆర్జన సాధ్యం కావడం, మిగిలినవాళ్లు నష్టాలతో ముగిసిపోవడం జరుగుతుంది.. ఎందుకని? అనేది సగటు ఇన్వెస్టర్‌కు అర్ధంకాదు. దీనికి సమాధానం తెలియాలంటే అసలు ముందుగా ఈక్విటీల ప్రదర్శన ఎలా ఉంటుంది, ఎలా ఇందులో రాబడులు ఉత్పన్నం అవుతాయో గమనించాలి. ఈక్విటీ మార్కెట్ రిటర్న్స్ సాధారణంగా కార్పొరేట్ ఎర్నింగ్స్‌పై ఆధారపడి ఉంటుంది. కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరిగితే సదరు షేరు ధర పెరగడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. స్వల్పకాలానికి మార్కెట్‌ను సెంటిమెంట్లు నడిపిస్తుంటాయి. కార్పొరేట్ ఎర్నింగ్స్ మూడు నెలలకు ఒకసారి వస్తాయి. కానీ షేరు ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. కేవలం ఎర్నింగ్స్ మీద ఆధారపడేవైతే షేర్ల ధరలు మూడు నెలలకొకమారే ధరలు మారాల్సిఉంటుంది. కానీ సెంటిమెంట్ కారణంగా ప్రతిరోజూ మార్కెట్లో ధరలు మారుతుంటాయి. దీంతో ఒక ఇన్వెస్టర్ లాభాలు గడిస్తే, మరొకరు నష్టాలు చూస్తుంటారు. బఫెట్ బాట.. ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తన పెట్టుబడుల వివరాలు ఏవీ గోప్యంగా ఉంచరు. ఆయన వేటిలో పెట్టుబడులు పెట్టారో బహిర్గతం చేస్తూనే ఉంటారు. కానీ ఆయన పోర్టుఫోలియో అనుకరించినవాళ్లలో చాలా కొంతమంది మాత్రమే లాభాలు పొందుతారు. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో టెక్నికలవిశ్లేషణ, రిసెర్చ్ కాన్న సెంటిమెంట్‌ను ఒడిసిపట్టడం కీలకమని తెలుస్తోంది. అందుకే సక్సెసయిన ఇన్వెస్టర్లు ఎక్కువగా సెంటిమెంట్‌ను ఫాలోకావడంపై ఎక్కువ ఫోకస్ పెట్టమని చెపుతుంటారు. అదే కారణం.. మనిషిలో ఉండే ఆశ మరియు భయం.. మార్కెట్లో సెంటిమెంట్‌ను శాసిస్తుంటాయి! ఆస్తి నష్టంతో వచ్చే భయాన్ని దాదాపు చావు భయంతో సమానంగా మనిషి మెదడు పరిగణిస్తుందని మానసిక నిపుణులు విశ్లేషించారు. అందుకే మార్కెట్లో నష్టం వస్తుందన్న భయాన్ని మనిషి తొందరగా ఫీలవుతాడు. అందుకే స్వల్ప ఒడిదుడుకులకు కూడా భయపడి లాంగ్‌టర్మ్ మాట మరిచి ముందే అమ్ముకొని బయటపడేందుకు ఎదురు చూస్తుంటాడు. ఇదే ప్రధానంగా నష్టాలకు కారణమవుతుంటుంది. కొంతమంది మాత్రమే ఒక పెట్టుబడి పెట్టి అది తగిన ఫలాలు ఇచ్చేవరకు దీర్ఘకాలం వేచిచూస్తారు. బఫెట్ సైతం ఇదే విధంగా లాభాలు పొందారు. కానీ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది మాత్రం రిసెర్చ్, విశ్లేషణకు అధికప్రాధాన్యమిచ్చి సెంటిమెంట్ ప్రాధాన్యతను మర్చిపోతుంటారు. కానీ నిజానికి మన పెట్టుబడిపై లాభనష్టాలను ఎక్కువ శాతం డిసైడ్ చేసేది సెంటిమెంటే! కాబట్టి మార్కెట్ మూడ్‌ను గమనించి ఆపై టెక్నికల్ విశ్లేషణ చేసుకొని పెట్టుబడులు పెట్టి, లాంగ్‌టర్మ్ వేచిచూస్తే ఈక్విటీల్లో సంపాదించే ఆ 5 శాతం మందిలో మీరు కూడా చేరతారని నిపుణులు సూచిస్తున్నారు. -
రామ్కీ ఎన్విరోలో కేకేఆర్‌కు 60% వాటా
హైదరాబాద్: రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్(ఆర్‌ఈఈఎల్)లో 60 శాతం వాటాను 560 మిలియన్ డాలర్లు (రూ.3,808 కోట్లు) వెచ్చించి అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ‘కేకేఆర్’ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఆదివారం ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ కంపెనీ విలువ 925 మిలియన్ డాలర్లు (రూ.6,290 కోట్లు) అవుతుంది. మున్సిపల్, బయోమెడికల్ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, ప్రాసెస్, రవాణా సేవల్లో ఆర్‌ఈఈఎల్ సేవలు అందిస్తోంది. అలాగే, పేపర్, ప్లాస్టిక్, కెమికల్స్ రీసైకిల్ వ్యాపారంలోనూ ఉంది. చెత్త నుంచి ఇంధన విద్యుత్ (పునరుత్పాదక ఇంధన వ్యాపారం) తయారీపైనా కంపెనీ దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 60 ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే, దక్షిణాసియాలోని పలు దేశాలు, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాలోనూ కార్యకలాపాలను కలిగి ఉంది. కేకేఆర్ తన ‘ఆసియా ఫండ్–3’ ద్వారా ఆర్‌ఈఈఎల్‌లో ఇన్వెస్ట్ చేయనుంది. ఇది ఒకానొక అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడి అవుతుంది. పర్యావరణ పరంగా ఎదుర్కొంటున్న అంశాల పరిష్కారానికి తమ కార్యక్రమాన్ని కేకేఆర్ సహకారంతో మరింత ముందుకు తీసుకెళతామని ఆర్‌ఈఈఎల్ ఎండీ, సీఈవో ఎం.గౌతంరెడ్డి తెలిపారు. ఆర్‌ఈఈఎల్ కార్యకలాపాలు స్వచ్ఛ్భారత్కు మద్దతునిచ్చేవిగా కేకేఆర్ ఇండియా సీఈవో సంజయ్‌నాయర్ పేర్కొన్నారు. -
ఆటుపోట్లున్నా.. పెట్టుబడుల వెల్లువ!
స్టాక్ మార్కెట్లలో జోరుగా ఇన్వెస్ట్ చేస్తున్న భారతీయులు ♦ ఇదే సమయంలో అమ్ముతున్న విదేశీ ఇన్వెస్టర్లు ♦ రికార్డు స్థాయికి చేరిన ఈక్విటీ పెట్టుబడులు ♦ ఈ ఏడాది మరింత పెరుగుతాయంటున్న నిపుణులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఏడాది కాలంగా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్నా.. దేశీయ చిన్న మదుపుదారులు ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. మార్కెట్లు పడుతున్నా నిర్భయంగా ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015-16 సంవత్సరంలో వివిధ ఆటుపోట్ల మధ్య స్టాక్ సూచీలు సుమారు 10 శాతం నష్టపోయినా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 70,812 కోట్లు ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టారు. కానీ ఇదే సమయంలో విదేశీ సంస్థాగత మదుపుదారులు రూ. 14,171 కోట్లు విలువైన ఈక్విటీలను విక్రయించడం గమనార్హం. ఎఫ్ఐఐలు ఇలా అమ్ముతున్నా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తుండటం మారుతున్న ట్రెండ్‌కి ఇది నిదర్శనమని డీఎస్పీ బ్లాక్‌రాక్ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ జవేరి తెలిపారు. గతేడాది (2014-15) ఈక్విటీలు మంచి లాభాలు అందించడంతో రికార్డు స్థాయిలో రూ. 86,816 కోట్లు ఇన్వెస్ట్ చేశారని, కానీ ఇప్పుడు ఒడిదుడుకుల్లో కూడా ఈ స్థాయిల్లో ఇన్వెస్ట్ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. 2014-15లో సగటున ప్రతి నెలా రూ. 7,550 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే గతేడాది రూ. 6,250 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అన్నిటికంటే ప్రధానమైన అంశం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగా మ్యూచువల్ ఫండ్ 53 లక్షల ఖాతాలు ప్రారంభం కావడం విశేషం. దీంతో మొత్తం మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య 4.7 కోట్లకు చేరింది. ఇందులో అత్యధిక శాతం చిన్న పట్ణణాల నుంచే ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) గణాంకాలు తెలియచేస్తున్నాయి. వడ్డీరేట్లు తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో ఈక్విటీ ఫండ్స్‌పై అవగాహన పెరుగుతుండటంతో రానున్న కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎండీ, సీఈవో నిమేష్ షా పేర్కొన్నారు. 2008లో రెండు లక్షల కోట్లుగా ఉన్న ఈక్విటీ ఫండ్స్ పెట్టుబడుల విలువ ఇప్పుడు సుమారు నాలుగు లక్షల కోట్లకు చేరిందన్నారు. లక్ష కోట్ల క్లబ్లో ఆరు సంస్థలు గతంలో మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సంస్థలకు లక్ష కోట్ల మార్కు అనేది ఒక కలగా ఉండేది. దీన్ని తొలిసారిగా 2008లో రిలయన్స్ ఎంఎఫ్ అందుకుంది. కానీ ఆ తర్వాత మార్కెట్ పతనంతో వెనుకబడిపోయింది. అయితే గత రెండేళ్ల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తుండటంతో ఇప్పుడు ఏకంగా 6 ఫండ్ హౌజ్‌లు ఈ మార్కును అందుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 42 ఫండ్ హౌజ్‌లు ఉండగా ఇందులో హెచ్డీఎఫ్సీ (రూ. 1.76 లక్షల కోట్లు), ఐసీఐసీఐ (రూ. 1.76 లక్షల కోట్లు), రిలయన్స్ (రూ. 1.59 లక్షల కోట్లు), బిర్లాసన్లైఫ్ (రూ. 1.36 లక్షల కోట్లు), ఎస్బీఐ (రూ. 1.07 లక్షల కోట్లు), యూటీఐ (రూ. 1.06 లక్షల కోట్లు)లు నిర్వహిస్తున్న ఆస్తుల విలువ ఈ మార్కును అధిగమించాయి. ఇదే విధమైన వృద్ధిరేటు ఉంటే ఈ ఏడాది రెండు లక్షల కోట్ల మార్కును అధిగమించగలమన్న ధీమాను పరిశ్రమ వ్యక్తం చేస్తోంది. తొలిసారిగా నిర్వహిస్తున్న ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అందుకోవడంపై ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎండీ సీఈవో దినేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 42 మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తున్న ఆస్తుల విలువలో 14% వృద్ధి నమోదయ్యింది. 2014-15లో రూ. 11,94,619 కోట్లుగా ఉన్న ఆస్తుల విలువ ఈ ఏడాది రూ. 1,63,940 కోట్లు పెరిగి రూ. 13,58,559 కోట్ల రికార్డు స్థాయికి చేరాయి. -
ఈక్విటీపై గురిపెడదాం..
- నాలుగేళ్లలో సెన్సెక్స్ లక్ష్యం 50,000 - 2008తో పోలిస్తే మార్కెట్లు ఇప్పుడే చౌక - బ్యాంకింగ్, ఇన్ఫ్రా, పవర్, మైనింగ్ జోరు సంకీర్ణ ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ 30 ఏళ్ల తర్వాత ఒక పార్టీకి పూర్తిగా మెజార్టీని ఇస్తూ ప్రజలు తీర్పు చెప్పారు. కష్టాల కడలిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కాబోయే ప్రధాని మోడీకి మరింత వెసులుబాటు కలగనుంది. అభివృద్ధి నినాదంతో ఏడాదిగా ప్రచారం ప్రారంభించిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందని సర్వేలు చెపుతుండటంతో గత మూడు నెలల్లోనే దేశీయ స్టాక్ సూచీలు 20 శాతానికి పైగా పెరిగాయి. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉండటం, ఇదే సమయంలో ఈక్విటీలు మంచి లాభాలను ఇచ్చే అవకాశాలు ఉండటంతో ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది సరైన సమయంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే గరిష్టస్థాయిలో ఉన్న మార్కెట్లు ఇంకా పెరిగే అవకాశాలున్నాయా, ఏ రంగాలు ఆకర్షణీయంగా ఉన్నా యన్న దానిపై స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి ఏమంటున్నారో చూద్దాం.. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న మార్కెట్ అంచనాలను నిజం చేయడమే కాకుండా, ఎవరూ ఊహించని విధంగా బీజేపీకే పూర్తిస్థాయి మెజార్టీ రావడం ఆశ్చర్యపర్చింది. స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న నమ్మకం ఏర్పడింది. ఆర్థిక సంస్కరణలకు అనుకూలమైన ప్రభుత్వం రావడంతో విదేశీ నిధులను ఇండియా ఆకర్షించనుంది. మధ్య, దీర్ఘకాలానికి ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ రూపంలో విదేశీ నిధులు పెరిగే అవకాశం ఉంది. నాలుగేళ్లలో రెట్టింపు ప్రస్తుతం మన స్టాక్ సూచీలు గరిష్ట స్థాయిలో కదులుతున్నా వచ్చే ఒకటి నుంచి మూడేళ్లు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకొని ఆ మేరకు స్టాక్ మార్కెట్లు కూడా పెరుగుతాయి. గత కొంతకాలంగా మార్కెట్లు పెరుగుతున్నా చిన్న ఇన్వెస్టర్లు, దేశీయ ఫండ్స్ దూరంగానే ఉన్నాయి. రానున్న కాలంలో ఎఫ్ఐఐ నిధులతో పాటు రిటైల్, డొమెస్టిక్ ఫండ్ నిధులు ఈక్విటీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండటంతో మార్కెట్లు మరింత పైకి పెరుగుతాయని చెప్పొచ్చు. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గి, వృద్ధిరేటు పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఏడాదిలో దేశీయ సూచీల నుంచి 20 నుంచి 30 శాతం లాభాలను ఆశించొచ్చు. మూడు, నాలుగేళ్లలో సూచీలు 80 నుంచి 100 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. అంటే ప్రస్తుతం సెన్సెక్స్ 25,000కు చేరువలో ఉండటంతో రానున్న కాలంలో 50,000 వరకు చేరే అవకాశం ఉంది. అయినా కొనవచ్చు... ప్రస్తుతం స్టాక్ సూచీలు గరిష్ట స్థాయిలో ఉండటంతో చాలా మంది చిన్న ఇన్వెస్టర్లు దూరంగా ఉంటున్నారు. సూచీలు గరిష్ట స్థాయిలో కదులుతున్నప్పటికీ గతంతో పోలిస్తే చౌకగానే ఉన్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. సెన్సెక్స్ 2014-15 ఆదాయాన్ని బట్టి లెక్కిస్తే సుమారు 16 పీఈ వద్ద కదులుతోంది. అదే 2008లో మార్కెట్లు గరిష్ట స్థాయికి చేరినప్పుడు సెన్సెక్స్ 24 పీఈ వద్దకు చేరింది. సగటు పీఈ చూస్తే 18గా ఉంది. అంటే ఏ విధంగా చూసినా ప్రస్తుతం మన సూచీలు చౌకగానే ఉన్నాయని, రానున్న కాలంలో మరింత పైకి పెరిగే అవకాశాలున్నాయని చెప్పొచ్చు. కొన్ని భయాలూ ఉన్నాయి.. దీర్ఘకాలానికి మార్కెట్లకు అన్ని శుభసూచనలే కనపడుతున్నా.. స్వల్పకాలానికి కొన్ని భయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు దేశ ఆర్థిక వ్యవస్థపై గట్టిగానే ప్రభావం చూపుతాయి. అదే విధంగా అధిక ద్రవ్యోల్బణం కూడా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. వీటికి తోడు అంతర్జాతీయంగా కొన్ని భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇవన్నీ సమీప భవిష్యత్తులో మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ భయాలున్నప్పటికీ వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో సంస్కరణలపరంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మార్కెట్లను ముందుకు నడిపిస్తాయి. కాబట్టి ప్రతికూలాంశాలతో వచ్చే చిన్నపాటి కరెక్షన్స్ను కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.