ప్రతీకాత్మక చిత్రం
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం అంటే ఇప్పటికీ చాలా మంది జంకుతారు. ఎందుకంటే ఇందులో లాభాలతో పాటు నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. కానీ ఓ ఇంజినీరు ఈక్విటీ మార్కెట్‌లో తన అద్భుతమైన ప్రయాణంతో దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూపించారు.
పంజాబ్‌లోని లుధియానాకు చెందిన కుల్దీప్ సింగ్ 1986లో జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ సందర్భంగా రూ.1,000 ఇన్వెస్ట్ చేశారు. స్టాక్ విభజనలు, బోనస్ ఇష్యూల తర్వాత 2024 జూన్ 7న ఆయన పెట్టుబడి విలువ రూ.1.36 కోట్లు అయింది. అప్పట్లో రూ.10 చొప్పున 100 షేర్లు కొనుగోలు చేసినట్లు కుల్దీప్ సింగ్ తెలిపారు.
కుల్దీప్ సింగ్ ప్రస్తుతం జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన 7,580 షేర్లను కలిగి ఉండగా, 2024 జూన్ 7న ఒక్కో షేరు విలువ రూ.1,800 వద్ద ముగిసింది. 2017లో పంజాబ్ స్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా పదవీ విరమణ చేసిన ఆయన పోర్ట్‌ఫోలియో విలువ ప్రస్తుతం రూ.4 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment