
ముంబై: ప్రముఖ ఈ-మొబిలిటీ ఫ్లాట్ ఫారం మెజెంటా సరికొత్తగా ఈవీఈటీ పేరుతో ఒక కొత్త కనెక్టెడ్ ఫ్లీట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ అమలు తీసుకొని వచ్చింది. ఈ సిస్టమ్ ద్వారా ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాన్ని ట్రాక్ అండ్ ట్రేస్ చేయడంతో పాటు వేహికల్ హెల్త్, డ్రైవింగ్ ప్రవర్తన, ఛార్జ్ స్టేటస్, తక్కువ ఛార్జ్ ఉంటే అలారం వంటివీ మరెన్నో ఆప్షన్స్‌తో ఈవీ డెలివరీ, లాజిస్టిక్స్ సర్వీసుల అందిస్తుంది. మెజెంటా 2021లో ఈవీఈటీ బ్రాండ్ కింద తన ఈ-మొబిలిటీ ఫ్లాట్ ఫారాన్ని ప్రారంభించింది.
ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ ఫ్లాట్ ఫారాన్ని ఉపయోగించి 400కు పైగా ఎలక్ట్రిక్ కార్గో డెలివరీ, లాజిస్టిక్స్ సర్వీసులను అందించింది. మెజెంటా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఛార్జ్ గ్రిడ్ బ్రాండ్ కింద ఈవీ ఛార్జింగ్ సదుపాయాలను కూడా అందిస్తుంది. ఈవీ సొల్యూషన్ టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్(టీసీయు) ద్వారా జనరేట్ చేసిన గణనీయమైన వాల్యూం డేటాను ప్రాసెస్ చేయగలదు. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ లపై రియల్ టైమ్లో దీనిని యాక్సెస్ చేసుకోవచ్చు.
(చదవండి: ఫేస్‌బుక్‌పై విజిల్ బ్లోయర్ ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు..!)
Comments
Please login to add a commentAdd a comment