చారిత్రాత్మకంగా,తిరుచిరాపల్లిని సాధారణంగా ఆంగ్లంలో "ట్రిచినోపోలీ" అని పిలుస్తారు. వాడుకంలో ఎక్కువగా "ట్రిచీ" లేదా "తిరుచ్చి" అని పిలుస్తారు. అధికారికంగా మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో తిరుచురాపల్లి అని ఉంటుంది. ఇక్కడ ఐకానిక్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది శ్రీ రంగనాథ స్వామి దేవాలాయం. తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ ఆలయ పట్టణాలలో ఒకటిగా పేరుగాంచింది ఈ తిరుచ్చి. ఇక్కడ ఉన్న అద్భుతమైన వాస్తు శిల్ప కళా సంపదను చూడవచ్చు. ఇది గొప్ప వారసత్వ సాంస్కృతికి నిలయం. ఆ నగరంలో చూడాల్సిన అద్భుత పర్యాటక ప్రదేశాలివే..
శ్రీరంగనాథ స్వామి ఆలయం..
తిరుచ్చి ఐకానిక్ ఆభరణంగా శ్రీరంగనాథ స్వామి ఆలయం అలరారుతుంది. ఈ ఆలయం సుమారు 156 ఎకరాల్లో ఏడు ప్రాకారాలతో నిర్మించారు. ఆలయానికి ప్రధాన ఆకర్షణగా 45 నుంచి 75 మీటర్ల ఎత్తు వరకు ఆలయ గోపురాలు ఉంటాయి. ముఖ్యంగా మూలల్లో చెక్కబడిన సంగీత స్థంబాలు, మందిరాలు, శతబ్దాల నాటి విగ్రహాలతో కూడి ఆలయాలు మనసును దోచుకునేలా ఉన్నాయి. వెయ్యి స్తంభాల హాలు మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ ప్రతినిత్యం ఆలయ కైంకర్యాలు నిరాటకంగా జరుగుతాయి.
మరో అద్భుత ఆలయం రాక్‌ఫోర్ట్..
రాక్‌ఫోర్ట్ అనేది 273 అడుగుల ఎత్తైన రాతిపై ఉన్న కోట. ఇది ఏకశిలలతో నిర్మితమైన గుహ దేవాలయాలు. వీటిని తొలుత పల్లవులచే నిర్మిచబడినప్పటికీ..తర్వాత ముధురై నాయకులు, విజయనగర పాలకులు పునర్నించారు. ఇక్కడ లింగ రూపంలో ఉన్న శివుడు థాయుమానవర్‌గా పూజలందుకోగా, పార్వతి దేవి మట్టవర్ కుజలమ్మాయిగా కొలుచుకుంటారు భక్తులు. ముందుగా రాతి కోట పాదాల వద్ద ఉన్న మాణిక్క వినాయకర్ ఆలయం దర్శంచుకుని, శివ పార్వతులు ఆలయాలను దర్శిస్తారు భక్తులు. ఈ రాతి శిలను ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా నమ్ముతారు. ఈ శిలా కోట చుట్టు ఉన్న కావేరి నదం దారంలా చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది.
సైకిల్‌పై చుట్టి రావచ్చు కూడా..
తిరుచ్చిలో ఉన్న పర్యాటక ప్రదేశాలను సైకిళ్లపై చుట్టి రావచ్చు కూడా. తెల్లవారుజాము నుంచి టూరిస్ట్ గైడ్ ఆధ్వర్యంలో సైకిల్ పర్యటనను ప్రారంభిస్తారు. 18వ శతాబ్దపు జెస్యూట్ క్వార్టర్స్ నుంచి దక్షిణాసియాలోని తొలి ప్రింటింగ్ ప్రెస్‌లు, బ్రిటిష్ కాలం నాటి టౌన్‌సైడ్ మాన్షన్‌లను చుట్టిరావొచ్చు. తిరుచ్చి పట్టణంలో ఐకానిక్‌గా ఉండే కావేరి వంతెన మిమ్మల్ని ఉత్సహపరిచేలా స్వాగతం పలుకుతుంది. ఆ మార్గ మధ్యంలో ఉండే వివిధ రుచులతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌లు మిమ్మల్ని ఆస్వాదించమన్నట్లుగా నోరూరిస్తాయి. ఒంటరి మహిళా ప్రయాణికులకు కూడా ఇది సురక్షితమైన నగరంగా పేరుగాంచింది.
కాంస్య కళాకారులు, స్తపతులు..
స్వామిమలైలోని పురాతన ఆలయ కళ గ్రామం చూస్తే..మీ కళ్ల ముందే రాతి శిల్పాలు పుట్టుకొస్తాయని రాసి ఉండటాన్ని చూడొచ్చు. ఇక్కడ మంచి నైపుణ్యం కలిగిన కాంస్య కళాకారులు, శిల్పులను చూడొచ్చు. ఇక్కడ శిల్పులు పవిత్ర క్షేత్రాల నంచి తీసిన మట్టి నమునాలను మైనపు కళాఖండాలుగా మార్చి, అగ్ని ఆచారాలతో నిండిన ఆధ్యాత్మిక లాస్ట్ వాక్స్ మెటల్ కాస్టింగ్ ప్రకియ ద్వారా మెరిసే విగ్రహాలుగా రూపొందించారు. ఇక్కడ శిల్పశాస్త్రానకి సంబధించిన అద్భుతమైన స్తపతులు దర్శనమిస్తారు. ముఖ్యంగా, మట్టి, మైనంతో చక్కటి విగ్రహాలను తయారు చేయడం వారి ప్రత్యేకత.
పచ్చదనానికి మారుపేరుగా ఉండే ఉద్యానవనాలు, ఎకోపార్క్‌లు..
ప్రశాంతమైన కావేరి నది చుట్టుతా పచ్చని ఉద్యానవనాలు పర్యాటకులను సేదతీరమని పిలుస్తున్నట్లుగా ఆహ్లదకరంగా ఉంటాయి. పక్షి జాతులకు సంబంధించన అభయ అరణ్యలు, ఎకో పార్క్‌లు ప్రదాన చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు. కావేరి నదిలో ఉండే చిన్న ద్వీపాల మాదిరగా ఉండే గ్రామాలను బోటింగ్‌తో చుట్టి వచ్చే సదుపాయం కూడా ఉంది. ఇక్కడి పార్కుల్లో జంతు శిల్పాలను పర్యాటకులను కట్టిపడేస్తాయి. హెర్బల్ గార్డెన్‌లు, పచ్చిక శిల్పాలు, పిల్లల ప్లే జోన్లు తదితర పర్యాటక ప్రదేశాలకు నెలవు ఈ తిరుచ్చి నగరం. తప్పక దర్శించి తరించాల్సిన ప్రదేశం ఇది.
(చదవండి: వాతావరణ యాంగ్జైటీ అంటే ఏంటి..? ఎదుర్కోవడం ఎలా..?)
Comments
Please login to add a commentAdd a comment