Tiruchirapalli
-
తిరుచ్చిలో చూడాల్సిన అద్భుత పర్యాటకప్రదేశాలివే..!
చారిత్రాత్మకంగా,తిరుచిరాపల్లిని సాధారణంగా ఆంగ్లంలో "ట్రిచినోపోలీ" అని పిలుస్తారు. వాడుకంలో ఎక్కువగా "ట్రిచీ" లేదా "తిరుచ్చి" అని పిలుస్తారు. అధికారికంగా మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో తిరుచురాపల్లి అని ఉంటుంది. ఇక్కడ ఐకానిక్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది శ్రీ రంగనాథ స్వామి దేవాలాయం. తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ ఆలయ పట్టణాలలో ఒకటిగా పేరుగాంచింది ఈ తిరుచ్చి. ఇక్కడ ఉన్న అద్భుతమైన వాస్తు శిల్ప కళా సంపదను చూడవచ్చు. ఇది గొప్ప వారసత్వ సాంస్కృతికి నిలయం. ఆ నగరంలో చూడాల్సిన అద్భుత పర్యాటక ప్రదేశాలివే..శ్రీరంగనాథ స్వామి ఆలయం..తిరుచ్చి ఐకానిక్ ఆభరణంగా శ్రీరంగనాథ స్వామి ఆలయం అలరారుతుంది. ఈ ఆలయం సుమారు 156 ఎకరాల్లో ఏడు ప్రాకారాలతో నిర్మించారు. ఆలయానికి ప్రధాన ఆకర్షణగా 45 నుంచి 75 మీటర్ల ఎత్తు వరకు ఆలయ గోపురాలు ఉంటాయి. ముఖ్యంగా మూలల్లో చెక్కబడిన సంగీత స్థంబాలు, మందిరాలు, శతబ్దాల నాటి విగ్రహాలతో కూడి ఆలయాలు మనసును దోచుకునేలా ఉన్నాయి. వెయ్యి స్తంభాల హాలు మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ ప్రతినిత్యం ఆలయ కైంకర్యాలు నిరాటకంగా జరుగుతాయి.మరో అద్భుత ఆలయం రాక్‌ఫోర్ట్..రాక్‌ఫోర్ట్ అనేది 273 అడుగుల ఎత్తైన రాతిపై ఉన్న కోట. ఇది ఏకశిలలతో నిర్మితమైన గుహ దేవాలయాలు. వీటిని తొలుత పల్లవులచే నిర్మిచబడినప్పటికీ..తర్వాత ముధురై నాయకులు, విజయనగర పాలకులు పునర్నించారు. ఇక్కడ లింగ రూపంలో ఉన్న శివుడు థాయుమానవర్గా పూజలందుకోగా, పార్వతి దేవి మట్టవర్ కుజలమ్మాయిగా కొలుచుకుంటారు భక్తులు. ముందుగా రాతి కోట పాదాల వద్ద ఉన్న మాణిక్క వినాయకర్ ఆలయం దర్శంచుకుని, శివ పార్వతులు ఆలయాలను దర్శిస్తారు భక్తులు. ఈ రాతి శిలను ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా నమ్ముతారు. ఈ శిలా కోట చుట్టు ఉన్న కావేరి నదం దారంలా చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. సైకిల్‌పై చుట్టి రావచ్చు కూడా..తిరుచ్చిలో ఉన్న పర్యాటక ప్రదేశాలను సైకిళ్లపై చుట్టి రావచ్చు కూడా. తెల్లవారుజాము నుంచి టూరిస్ట్ గైడ్ ఆధ్వర్యంలో సైకిల్ పర్యటనను ప్రారంభిస్తారు. 18వ శతాబ్దపు జెస్యూట్ క్వార్టర్స్ నుంచి దక్షిణాసియాలోని తొలి ప్రింటింగ్ ప్రెస్‌లు, బ్రిటిష్ కాలం నాటి టౌన్సైడ్ మాన్షన్లను చుట్టిరావొచ్చు. తిరుచ్చి పట్టణంలో ఐకానిక్‌గా ఉండే కావేరి వంతెన మిమ్మల్ని ఉత్సహపరిచేలా స్వాగతం పలుకుతుంది. ఆ మార్గ మధ్యంలో ఉండే వివిధ రుచులతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌లు మిమ్మల్ని ఆస్వాదించమన్నట్లుగా నోరూరిస్తాయి. ఒంటరి మహిళా ప్రయాణికులకు కూడా ఇది సురక్షితమైన నగరంగా పేరుగాంచింది. కాంస్య కళాకారులు, స్తపతులు..స్వామిమలైలోని పురాతన ఆలయ కళ గ్రామం చూస్తే..మీ కళ్ల ముందే రాతి శిల్పాలు పుట్టుకొస్తాయని రాసి ఉండటాన్ని చూడొచ్చు. ఇక్కడ మంచి నైపుణ్యం కలిగిన కాంస్య కళాకారులు, శిల్పులను చూడొచ్చు. ఇక్కడ శిల్పులు పవిత్ర క్షేత్రాల నంచి తీసిన మట్టి నమునాలను మైనపు కళాఖండాలుగా మార్చి, అగ్ని ఆచారాలతో నిండిన ఆధ్యాత్మిక లాస్ట్ వాక్స్ మెటల్ కాస్టింగ్ ప్రకియ ద్వారా మెరిసే విగ్రహాలుగా రూపొందించారు. ఇక్కడ శిల్పశాస్త్రానకి సంబధించిన అద్భుతమైన స్తపతులు దర్శనమిస్తారు. ముఖ్యంగా, మట్టి, మైనంతో చక్కటి విగ్రహాలను తయారు చేయడం వారి ప్రత్యేకత. పచ్చదనానికి మారుపేరుగా ఉండే ఉద్యానవనాలు, ఎకోపార్క్‌లు..ప్రశాంతమైన కావేరి నది చుట్టుతా పచ్చని ఉద్యానవనాలు పర్యాటకులను సేదతీరమని పిలుస్తున్నట్లుగా ఆహ్లదకరంగా ఉంటాయి. పక్షి జాతులకు సంబంధించన అభయ అరణ్యలు, ఎకో పార్క్‌లు ప్రదాన చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు. కావేరి నదిలో ఉండే చిన్న ద్వీపాల మాదిరగా ఉండే గ్రామాలను బోటింగ్‌తో చుట్టి వచ్చే సదుపాయం కూడా ఉంది. ఇక్కడి పార్కుల్లో జంతు శిల్పాలను పర్యాటకులను కట్టిపడేస్తాయి. హెర్బల్ గార్డెన్లు, పచ్చిక శిల్పాలు, పిల్లల ప్లే జోన్లు తదితర పర్యాటక ప్రదేశాలకు నెలవు ఈ తిరుచ్చి నగరం. తప్పక దర్శించి తరించాల్సిన ప్రదేశం ఇది.(చదవండి: వాతావరణ యాంగ్జైటీ అంటే ఏంటి..? ఎదుర్కోవడం ఎలా..?) -
ఎన్నికల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత.. డిఫరెంట్ స్టైల్ ప్రచారం!
చెన్నై: దేశంలో ఎన్నికల సందడి నడుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీల నేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఎన్నికల సిత్రాల్లో భాగంగా నేతలు కూరగాయలు అమ్ముతూ, వంట చేస్తూ వివిధ పనుల్లో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కాగా, ఎన్నికల సందర్భంగా తమిళనాడులోని తిరుచిరాపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండింట్ అభ్యర్థిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్. దామోదరన్ డిఫరెంట్ బరిలో నిలిచారు. ఎన్నికల సందర్భంగా దామోదరన్ డిఫరెంట్ స్టైల్లో ప్రచారం మొదలుపెట్టారు. దీంతో, ఆయన ప్రచారం సోషల్ మీడియా సహా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఇంటిపెండెంట్ అభ్యర్థి కాగా.. ఈసీ ఆయనకు గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది. #WATCH | Tiruchirappalli, Tamil Nadu: Independent candidate from Trichy Lok Sabha seat Padma Shri S Damodaran indulges in making flower garland and sells vegetables as the part of Election Campaign pic.twitter.com/9iARbrat1O — ANI (@ANI) April 11, 2024 ఇక, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో దామోదరన్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో స్థానిక మార్కెట్ వద్ద ఉధృత ప్రచారం నిర్వహిస్తున్న దామోదరన్.. తనకు ఓటు వేయాలంటూ అక్కడి వీధి వ్యాపారులు, సామాన్యులను కోరారు. వ్యాపారులతో కలిసి కూరగాయలు, పూలు అమ్ముతూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా దామోదరన్ మాట్లాడుతూ.. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. తిరుచిరాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాను. గత నలభై ఏళ్లుగా నేను పారిశుధ్య వాలంటీర్‌గా పనిచేస్తున్నాను. 21 ఏళ్ల వయసప్పుడు నా కెరీర్ ప్రారంభించా. ఇప్పుడు నాకు 62 ఏళ్లు. 60 ఏళ్ల వయసులో నాకు పద్మశ్రీ లభించింది చెప్పుకొచ్చారు. తనను గలిపిస్తే పచ్చదనంతో పాటుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. దీంతో, ఆయన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మాంసంలో నాటు బాంబులు పెట్టి..
చెన్నై: కేరళ గర్భిణి ఏనుగు మృతిపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో తమిళనాడులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పేలుడు పదార్థాలు కలిపిన మాంసం తిని నక్క మృత్యువాత పడింది. ఈ ఘటనలో 12 మందిని స్థానిక అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. వివరాలు.. నారికురవర్లుగా వ్యవహరించబడే వివిధ తెగలకు చెందిన వ్యక్తులు జంతువులను వేటాడి జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం నక్క దంతాలు సేకరించేందుకు.. మాంసంలో పేలుడు పదార్థాలు పెట్టి దానికి ఎరవేశారు. మాంసాన్ని చూసి అక్కడికి చేరుకున్న నక్క.. దానిని తినేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.(13 కోతులు మృతి: విషం పెట్టి చంపారా?) ఈ ఘటనలో దాని దవడలు, ముఖం చెల్లాచెదురై పోయి.. అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు 12 మంది నారికురవర్లను అరెస్టు చేశారు. ఈ విషయం గురించి అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ..‘‘తేనె సేకరించేందుకు 12 మంది తిరుచి సమీపంలోని ఓ గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా నక్క వారి కంటపడింది. దీంతో తమ వద్దనున్న నాటు బాంబులు మాంసంలో పెట్టి.. నక్కకు అందుబాటులో ఉంచారు. నక్క దానిని తినగానే దవడ పేలిపోయింది. నొప్పితో అల్లాడుతూ అది చనిపోయింది’’ అని వెల్లడించారు. అనంతరం నక్క మృతదేహాన్ని ఓ సంచీలో వేసుకుని.. టీ తాగుతుండగా.. నిందితుల ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఓ కానిస్టేబుల్ తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. విచారణలో భాగంగా వారు నక్కను వేటాడి చంపినట్లు వారు అంగీకరించినట్లు పేర్కొన్నారు. (కుక్క నోటికి ప్లాస్టర్ చుట్టి..) -
బోరుబావిలో బాలుడు; కొనసాగుతున్నసహాయక చర్యలు
తిరుచురాపల్లి : తమిళనాడులోని తిరుచురాపల్లి జిల్లా నాడుకట్టుపట్టిలో శుక్రవారం సాయంత్రం రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓ బోరుబావిలో పడ్డాడు. స్థానికులు సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఆరు రెస్య్కూ బలగాలతో పాటు, ఐఐటీ మద్రాస్ తయారు చేసిన రోబోటిక్ పరికరాన్ని తెప్పించారు. బాలుడిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బాలుడు 75 అడుగుల లోతులో ఉన్నట్లు తెలిసింది. అయితే బాలుడు ఉన్న బావికి సమాంతరంగా గొయ్యిని తవ్వినా ఫలితం లేకపోవడంతో ఊపిరి తీసుకోవడానికి పైపు ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరుచురాపల్లికి చెందిన రెక్టో అరోకియరాజ్, కళామేరీ దంపతులకు సుజిత్ విల్సన్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం తల్లి కళామేరీ ఇంట్లో పనిచేసుకుంటుంది. తండ్రి వేరే పనిలో నిమగ్నమవగా అదే సమయంలో సుజిత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. బావిలో పడిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వ్యవసాయానికి నీళ్లు అవసరమవడంతో ఈ మద్యనే అరోకియాజ్ బోరు బావిని తవ్వించాడు. నీళ్లు సరిగా పడకపోడంతో దానిని పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు బోరు బావులను పూడ్చేయాలంటూ 2010లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గమనార్హం. -
శ్రీరంగం ఆలయానికి బాంబు బెదిరింపు
తిరుచిరాపల్లి:తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం పట్టణానికి సమీపంలోఉన్న సుప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని బాంబులతో కూల్చివేస్తామనే లేఖ కలకలం రేపుతోంది. ఈనెల 29లోగా రంగనాథ స్వామి ఆలయాన్నే లక్ష్యంగా చేసుకుని భారీ విధ్వంసం సృష్టిస్తామని కొందరు దుండగులు ఉత్తరం ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పాటుగా రైల్వే స్టేషన్లో, బస్సు స్టేషన్లలో కూడా బాంబులతో దాడులు చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఉలిక్కిపడిన తిరుచిరాపల్లి పోలీసులు ఆలయం వద్ద భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. ఈ బెదిరింపు లేఖపై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తిరుచిరాపల్లి పోలీస్ కమిషనర్ శైలేష్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగంణంలో 24 గంటలు బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ ప్రవేశానికి, బయటకు రావడానికి మూడు పాయింట్లను ఏర్పాట్లు చేశామన్నారు. దీంతోపాటుగా బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో కూడా పోలీసులను అప్రమత్తం చేసినట్లు కమిషనర్ తెలిపారు.