చెన్నై: దేశంలో ఎన్నికల సందడి నడుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీల నేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఎన్నికల సిత్రాల్లో భాగంగా నేతలు కూరగాయలు అమ్ముతూ, వంట చేస్తూ వివిధ పనుల్లో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
కాగా, ఎన్నికల సందర్భంగా తమిళనాడులోని తిరుచిరాపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండింట్ అభ్యర్థిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్. దామోదరన్ డిఫరెంట్ బరిలో నిలిచారు. ఎన్నికల సందర్భంగా దామోదరన్ డిఫరెంట్ స్టైల్‌లో ప్రచారం మొదలుపెట్టారు. దీంతో, ఆయన ప్రచారం సోషల్ మీడియా సహా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఇంటిపెండెంట్ అభ్యర్థి కాగా.. ఈసీ ఆయనకు గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది.
#WATCH | Tiruchirappalli, Tamil Nadu: Independent candidate from Trichy Lok Sabha seat Padma Shri S Damodaran indulges in making flower garland and sells vegetables as the part of Election Campaign pic.twitter.com/9iARbrat1O
— ANI (@ANI) April 11, 2024
ఇక, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో దామోదరన్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో స్థానిక మార్కెట్ వద్ద ఉధృత ప్రచారం నిర్వహిస్తున్న దామోదరన్.. తనకు ఓటు వేయాలంటూ అక్కడి వీధి వ్యాపారులు, సామాన్యులను కోరారు. వ్యాపారులతో కలిసి కూరగాయలు, పూలు అమ్ముతూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా దామోదరన్ మాట్లాడుతూ.. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. తిరుచిరాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాను. గత నలభై ఏళ్లుగా నేను పారిశుధ్య వాలంటీర్‌గా పనిచేస్తున్నాను. 21 ఏళ్ల వయసప్పుడు నా కెరీర్ ప్రారంభించా. ఇప్పుడు నాకు 62 ఏళ్లు. 60 ఏళ్ల వయసులో నాకు పద్మశ్రీ లభించింది చెప్పుకొచ్చారు. తనను గలిపిస్తే పచ్చదనంతో పాటుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. దీంతో, ఆయన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment