
అజర్‌బైజాన్ కు బై బై చెప్పారు అజిత్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా, అర్జున్ , ఆరవ్, రెజీనా, నిఖిల్ ఇతర రోల్స్‌లో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తాజాగా అజర్‌బైజాన్‌లో ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ పూర్తయింది. అజిత్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటుగా, ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారట మేకర్స్.
కాగా దాదాపు పదమూడేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గ్యాంబ్లర్’ (2011) సినిమా తర్వాత అజిత్–అర్జున్ –త్రిష కలిసి నటిస్తున్న సినిమా ‘విడాముయర్చి’ కావడం విశేషం. హీరో కుటుంబం విహారయాత్రకు వెళ్తుంది. అక్కడ హీరో భార్య, అతని కుమార్తె అదృశ్యం అవుతారు. వారి ఆచూకీని హీరో ఎలా కనుక్కున్నాడు? ఏ విధంగా రక్షించాడు? అన్నది ‘విడాముయర్చి’ కథ అని కోలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment