Interesting Buzz On Ajith Kumar Thunivu Movie Climax Scene Goes Viral - Sakshi
Sakshi News home page

Ajith Kumar-Thunivu: తెగింపు క్లైమాక్స్‌పై అదిరిపోయే బజ్‌! ఆడియన్స్‌కి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పిరియన్స్‌ ఖాయం..

Published Tue, Jan 3 2023 7:00 PM | Last Updated on Tue, Jan 3 2023 7:24 PM

Buzz: Interesting Buzz On Ajith Kumar Thunivu Movie Climax Scene - Sakshi

తమిళ స్టార్‌ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తునివు’. ఇటీవల నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తెగింపు పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్‌లోన యాక్షన్‌ సీక్వెన్స్‌ ఈ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేశాయి. దీంతో మూవీలోని మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ అజిత్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు సినీ విశ్వేషకులు.

చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్‌ రివ్యూ, సెన్సార్‌ టాక్‌ ఎలా ఉందంటే!

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. మూవీలోని క్లైమాక్స్‌ ఎవరూ ఊహించిన రేంజ్‌లో ఉండబోతుందట. ఆడియెన్స్‌ను సీట్లకు అతుక్కుపోయేలా థ్రిలింగ్‌ ఎలిమెంట్స్‌తో క్లైమాక్స్‌ను డిజైన్‌ చేశాడట డైరెక్టర్‌. ముఖ్యంగా ఈ సినిమా మొత్తంలో హీరో అజిత పేరు ఎక్కడా రివీల్ చేయకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతుందట. క్లైమాక్స్‌లో ఉండే యాక్షన్స్‌ సీన్స్‌, అదే సమయంలో హీరో రోల్‌ బయటపడటం అంతా ఆడియన్స్‌కి ఓ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పిరియన్స్‌ ఉండబోతుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మూవీ రిలీజ్‌ డేట్‌ వరకు వేచి చూడాల్సిందే.

చదవండి: స్టేజ్‌పై మాట్లాడుతూ రష్మికకు దిష్టి తీసిన విజయ్‌, వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement