ఇంకా సమయం ఉంది | Rakul Preet About Her Role In Bharateeyudu 2 | Sakshi
Sakshi News home page

ఇంకా సమయం ఉంది

Published Tue, Jun 11 2024 12:07 AM | Last Updated on Tue, Jun 11 2024 12:07 AM

Rakul Preet About Her Role In Bharateeyudu 2

‘‘భారతీయుడు 2(తమిళంలో ఇండియన్‌ 2)’ చిత్రం నా కెరీర్‌లో బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ మూవీలో నేను చేసిన పాత్ర నా నిజజీవితానికి చాలా దగ్గరగా ఉందనే భావన కలిగించింది. ఈ సినిమా గురించి చాలా విషయాలు జనాలతో పంచుకోవాలనే ఆత్రుతగా ఉంది. కానీ, అందుకు ఇంకా సమయం ఉంది’’ అంటున్నారు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. నటుడు, దర్శక–నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్‌ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 21న జరిగిన విషయం తెలిసిందే.

పెళ్లి కోసం కొద్ది రోజులు సినిమాలకు విరామం ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ జోరుమీదున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. హీరో కమల్‌ హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ కి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందింది. ఈ మూవీలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రలో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ మూవీ జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.

కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ–‘‘భారతీయుడు 2’ నా కెరీర్‌లోనే ఎంతో స్పెషల్‌ మూవీ. ఇందులో ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిగా కనిపిస్తాను. నా గత చిత్రాలకంటే ఈ మూవీలోని నా క్యారెక్టర్‌ వైవిధ్యంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో ప్రయాణం చేసినన్ని రోజులు గొప్ప అనుభూతి కలిగింది. శంకర్‌గారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement