బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు పొందింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా హోదా పొందిన ఆమె ఇటీవల మళ్లీ బాలీవుడ్‌కు మాకాం మార్చింది. గతేడాది హిందీలో ఐదు సినిమాలు చేసిన ఆమె తెలుగులో ఏ ఒక్క సినిమా చేయలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటుంది. అలాగే బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ కొంతకాలంగా రకుల్ ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే.
చదవండి: నటి ఖుష్బూకు చిరంజీవి శుభాకాంక్షలు
టాలీవుడ్‌కు రాకముందు హిందీ అడపదడపా సినిమాలు చేసిన రకుల్‌కు స్టార్ నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం టాలీవుడ్‌యే. ఇక రకుల్ బాలీవుడ్‌కు చెక్కెయడంపై సౌత్ ప్రేక్షకులు ఆమెపై తరచూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హిందీ చిత్రాలతో పోలిస్తే దక్షిణాది సినిమాలే మంచి విజయాలు అందుకుంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పోతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన సౌత్ సినిమాల పేర్లు మారు మోగుతున్నాయి. ఈ క్రమంలో హిందీ చిత్రాలు వెలవెలపోతున్నాయి. ఓటీటీలో సైతం మన సినిమాలే సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ వర్సెస్ సౌత్ అనే అంశం తరచూ చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై రకుల్ స్పందించింది.
చదవండి: భర్త కోసం నయన్ వ్యూహం.. ఆ డైరెక్టర్‌కి హ్యాండ్ ఇచ్చిన విజయ్ సేతుపతి?
‘సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు. హిందీ సినిమాలు, ప్రాంతీయ సినిమాలు రెండూ ఒకటే. వాటిని ఒకదానితో ఒకటి పోల్చడం సరికాదు. అన్నిటికన్నా ప్రేక్షకులే ముఖ్యం. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. మన దేశంలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారు. వారు భారత సినీ పరిశ్రమకు మంచి పేరు తెచ్చే సినిమాలను రూపొందించగలరు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఇటివల కాలంలో ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగిందని, సినిమా బాగుంటే థియేటర్లో పాటు ఓటీటీలో కూడా చూస్తున్నారని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment