దక్షిణాదిలో క్రేజీ నటిగా గుర్తింపు పొందిన రకుల్ ప్రీతిసింగ్‌కు ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రమే. కోలీవుడ్‌లో కమలహాసన్ సరసన ఆమె ఇండియన్–2 చిత్రంలో మాత్రమే నటిస్తోంది. దీంతో ఈ చిత్రంపైన రకుల్ ప్రీతిసింగ్ అనేక ఆశలను పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రకుల్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రేక్షకుల అభిరుచి మారిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉత్తరాది, దక్షిణాది చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణపై ఈ సందర్భంగా ఆమె స్పందించింది.
చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్‌లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా..
కరోనా తరువాత చిత్ర కంటెంట్, విజయం సాధించిన చిత్రాల గురించి పెద్ద చర్చే జరుగుతోందని చెప్పింది. ఇది ఆరోగ్యకరమైన పరిస్థితులకు దారితీస్తోందని చెప్పుకొచ్చింది. అయితే దీని వెనక చాలా శ్రమనే ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు మంచి విజయాలను సాధిస్తున్నాయని చెప్పింది. జనం వారి జీవితాలకు మించిన సినిమాలు రావాలని కోరుకుంటున్నారని రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయపడింది. కాగా ఇటీవల తనకు సరైన హిట్టు పడలేదనే ఆవేదతోనే ఆమె ఇలా మాట్లాడుతోందని కొందరు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment