గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్.. హన్సిక. ఆమె ఇప్పుడు 'గాంధారి'గా మారి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఆర్. కన్నన్ స్వీయ దర్శకత్వం వహించడంతోపాటు మసాలా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈయన దర్శకత్వంలో, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రం విశేష ఆదరణ పొందింది. అదేవిధంగా ఇంతకు ముందు జయం కొండాన్, కండెన్ కాదలై, సేటై, ఈవెన్ తందిరన్, బిస్కోత్ వంటి పలు వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా 'గాంధారి' పేరుతో చిత్రాన్ని చేస్తున్నారు.
ఇది ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కమర్షియల్ అంశాలతో కూడిన హారర్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని తాజాగా ఆయన వెల్లడించారు. ఇందులో పురావస్తు శాఖ అధికారిగా పనిచేసే యువతిగా హన్సిక నటిస్తున్నారని తెలిపారు. పురాతన కాలంలో ఓ రాజు నిర్మించిన గాంధర్వ కోటను పరిశోధించడానికి వెళ్లగా, అక్కడ ఆమెకు పలు ఆశ్చర్యకరమైన ఘటనలు ఎదురవుతాయన్నారు.
ఇందులో హన్సిక పురావస్తు శాఖ అధికారిగా, ఓ ప్రాచీన తెగకు చెందిన యువతిగా దిపాత్రాభినయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం చైన్నె సముద్ర తీరంలో రూ.60 లక్షల వ్యయంతో బ్రహ్మాండమైన కొండ ఇంటి సెట్ వేసి అందులో 1943 నాటి సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఇందులో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్, ఆడుగళం నరేన్, స్టంట్ సిల్వ, వినోదిని, పవన్ కుడివేలు మురుగన్, కలైరాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 2025లో సినిమా విడుదల కానుంది. తెలుగులో కూడా గాంధారి సినిమా రిలీజ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment