న్యూఢిల్లీ: అమెరికాలోని తమ వ్యాపార అవసరాల రీత్యా వచ్చే 12 నెలల్లో దక్షిణాదిలో 3,000 పైచిలుకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను తీసుకోనున్నట్లు ఐటీ సేవల సంస్థ వీ టెక్నాలజీస్ వెల్లడించింది. రూ. 200 కోట్లతో చేపట్టిన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా తొలుత బయోటెక్, సైన్స్, ఆర్ట్స్ విభాగంలో 1,200 మందిని నియమించుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు సంస్థ సీఈవో చాకో వలియప్ప తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో మెడికల్ కోడర్స్, కాలింగ్ ఏజెంట్స్‌ను నియమించు కుంటున్నట్లు వివరించారు. వీ టెక్నాలజీస్‌కు దేశీయంగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో .. అంతర్జాతీయంగా ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో, అమెరికాలో వివిధ ప్రాంతాల్లో డెలివరీ సెంటర్స్ ఉన్నాయి. హెల్త్‌కేర్, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లోని సంస్థలకు సర్వీసులు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment