
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్ ’. ఈ మూవీ కాస్త ఆలస్యంగా థియేటర్స్‌లోకి రానుంది. సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్‌జే సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది.
నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను తొలుత జూన్ 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ జూలై 26న రిలీజ్ చేయనున్నట్లుగా ధనుష్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ధనుష్ కెరీర్‌లో 50వ సినిమాగా రూపొందిన ‘రాయన్’ కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment