కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు | Karnataka Congress MP Separate Country Remark | Sakshi
Sakshi News home page

కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Thu, Feb 1 2024 6:38 PM | Last Updated on Thu, Feb 1 2024 7:06 PM

Karnataka Congress MP Separate Country Remark - Sakshi

బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశానికి ప్రత్యేక దేశం కావాలని అన్నారు. కేంద్రం నుంచి కర్ణాటకకు రావాల్సిన నిధులు సరిగా అందడం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందని అన్నారు. దక్షిణానికి రావాల్సిన నిధులు ఉత్తరానికి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక దేశం డిమాండ్ చేయడం తప్పా మరో మార్గం లేదని అన్నారు. 

డీకే సురేష్ ప్రకటనపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి విభజించు-పాలించే స్వభావం ఉందని విమర్శించారు. డీకే సురేష్ ప్రస్తుతం ఉత్తరం, దక్షిణ విభజించాలని కోరుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో కర్ణాటకకు పన్నుల పంపిణీ ఎలా పెరిగిందో తెలిపే డేటాను సూర్య షేర్ చేశారు.

'ఒకవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశాన్ని ఏకం చేసేందుకు అని చెబుతూ పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు దేశాన్ని విభజించేందుకు కర్ణాటకలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. విభజించు.. పాలించే విధానం కాంగ్రెస్ స్వభావమే. వలసవాదులు అనుసరించిన దానికంటే చాలా ఘోరం.' అని తేజస్వీ సూర్య అన్నారు.

ఇదీ చదవండి: అభివృద్ధి నినాదం.. బడ్జెట్ విధానం: నిర్మలా సీతారామన్


  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement