
మంచు కొండల్లో ఫ్యామిలీతో కలిసి చల్లగా చిల్ అవుతున్నారు హీరో అల్లు అర్జున్. భార్య స్నేహ, కుమారుడు అయాన్, కుమార్తె అర్హలతో కలిíసి వేసవిని ఎంజాయ్ చేయడానికి స్విట్జర్లాండ్ వెళ్లారు అల్లు అర్జున్. అక్కడ గడుపుతున్న తమ ఆనందపు క్షణాలను ఫొటోస్‌లో బంధించి అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘లైఫ్‌లో ఎలా ఉండాలి? అని నేను వాళ్లను (కుమార్తె, కుమారుడిని ఉద్దేశించి) అడిగితే ‘హ్యాపీగా’ అన్నారు’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. అన్నట్లుగానే బన్నీ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. సమ్మర్ వెకేషన్‌ను పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్‌లో జరగనున్న ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు అల్లు అర్జున్. ఈ సినిమా కాకుండా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment