
బన్నీ ముద్దుల కూతురు 'అర్హా'
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రిస్టమస్ సందర్భంగా తన అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడు. తన ముద్దుల కూతురి ఫొటోను తొలిసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బన్నీ, తన కూతురి పేరు అర్హా అంటూ అభిమానులకు పరిచయం చేశాడు. అంతేకాదు తనకు ఆ పేరు ఎందుకు పెట్టారో కూడా వివరించాడు బన్ని. Arjun లో AR, Sneha లో HA లను కలిపి ARHA (అర్హా) అని పేరు పెట్టినట్టుగా వివరించాడు.
అంతేకాదు ఆ పేరుకు హైదవంలో శివుడు అని ఇస్లాంలో శాంతి, నిర్మలం అనే అర్ధాలు వస్తాయని వివరించాడు. గతంలో క్రిస్టమస్ సందర్భంగా కొడుకు అయాన్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే బన్నీ.., ఈ సారి తన కూతురి ఫొటోను పోస్ట్ చేశాడు. బన్నీతో పాటు మరో యంగ్ హీరో ఆది కూడా తన ముద్దుల కూతురి ఫొటోలతో అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశాడు.
Our newly arrived angel Ꭿllυ Ꭿrhα. Hindu meaning : Lord Shiva . Islamic meaning : Calm& Serene. "AR" jun & Sne "HA" together ARHA #AlluArha pic.twitter.com/eD40TFhMgh
— Allu Arjun (@alluarjun) 25 December 2016