Sneha Shares Exercise Video, Fans Request 'Please Don't Do This' - Sakshi
Sakshi News home page

Sneha: వీడియో షేర్‌ చేసిన స్నేహ.. అలా చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటూ అభిమానుల హెచ్చరిక

Published Thu, Aug 10 2023 4:20 PM | Last Updated on Thu, Aug 10 2023 4:38 PM

Sneha Shares Exercise Video, Fans Request to Not Do That - Sakshi

ఆమె చీరకట్టుకుంటే చందమామే నేలకు దిగివచ్చినట్లుగా ఉంటుంది. తను నడుస్తుంటే హంస సైతం కుళ్లుకుంటుంది. హావభావాలు ఒలికించడంలో ఆమెను మించినవారే లేరు.. ఇలా హీరోయిన్‌ స్నేహ గురించి శతకోటి వర్ణనలు చేసే అభిమానులు చాలామందే ఉన్నారు. తన నటనతో ఎంతోమంది మనసులు గెలుచుకున్న స్నేహ ఆ మధ్య భర్తతో విడాకులు తీసుకోనుందంటూ రూమర్స్‌ వచ్చాయి. దీంతో హీరోయిన్‌ తన భర్తతో కలిసి దిగిన ఫోటో షేర్‌ చేసి ఈ పుకార్లకు చెక్‌ పెట్టింది. 

అంత బరువులు ఎత్తడం అవసరమా?
ఎప్పుడూ అందమైన ఫోటోలు షేర్‌ చేసే స్నేహ తాజాగా ఓ వర్కవుట్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇందులో ఆమె బరువు ఎత్తుతూ ఎక్సర్‌సైజ్‌ చేసింది. అది చాలా బరువుగా ఉందని స్నేహ ఎక్స్‌ప్రెషన్‌ చూస్తేనే అర్థమవుతోంది. అలాంటప్పుడు ఇంత బరువు మోయడం ఎందుకని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి ఎక్సర్‌సైజ్‌ల వల్ల గుండెపోటు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని, చాలామంది సెలబ్రిటీలు ఇదే కారణంతో చనిపోతున్నారని పేర్కొంటున్నారు. ఈ బరువులు ఎత్తడానికి బదులుగా యోగా చేయొచ్చు కదా అని సూచిస్తున్నారు. భారీ బరువులు ఎత్తడం వల్ల గుండెపోటు ప్రమాదాలు పెరుగుతున్నందున ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రియమైన నీకు చిత్రంతో టాలీవుడ్‌ ప్రయాణం
స్నేహ సినిమాల విషయానికి వస్తే.. ప్రియమైన నీకు (2001) చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హనుమాన్‌ జంక్షన్‌, వెంకీ, సంక్రాంతి, రాధా గోపాలం, శ్రీరామదాసు, రాజన్న.. ఇలా అనేక హిట్‌ చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది. ఆమె తెలుగులో చివరగా 2019లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో కనిపించింది.

చదవండి: మొదట్లో పెళ్లంటేనే కోపమొచ్చేది, కానీ ఇప్పుడు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement