
Actress Sneha Files Complaint Chennai Kanathur Police Station: ప్రముఖ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ స్నేహా పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు వ్యాపారవేత్తలపై చెన్నైలోని కానత్తూర్ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా సమాచారం ప్రకారం.. చెన్నైలోని ఓ ఎక్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తమ బిజినెస్ కోసం డబ్బు అప్పుగా తీసుకున్నారని, వారికి వడ్డీ కింద 26 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆమె పోలీసులకు తెలిపారు. అయితే ఇప్పుడు వారు తనని మోసం చేశారని, వడ్డీ చెల్లించమని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఆరోపించారు.
చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్
అలాగే తాను ఇచ్చిన రూ. 26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని స్నేహా తన ఫిర్యాదు పేర్కొన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. తన ఫిర్యాదు మేరకు దీనిపై దర్యాప్తు చేపట్టాలని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్నేహా పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. కాగా స్నేహా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఒకప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా రాణించిన స్నేహా ఆ తర్వాత తన చిరకాల స్నేహితులు, నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంటకు ఒక కుమారుడు, కూమార్తె ఉన్నారు. పెళ్లి తర్వాత స్నేహా పలు వాణిజ్య ప్రకటనలతో పాటు సినిమాల్లో సహాయ నటిగా, హీరోలకు వదిన, అక్క వంటి పాత్రలు చేస్తూ వస్తున్నారు.
చదవండి:
నయన్‌కు సామ్ బర్త్‌డే విషెస్, లేడీ సూపర్‌స్టార్‌పై ఆసక్తికరంగా పోస్ట్
46 ఏళ్లకు తల్లైన స్టార్ హీరోయిన్, కవలలకు జననం
Comments
Please login to add a commentAdd a comment