bussiness men
-
పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా
Actress Sneha Files Complaint Chennai Kanathur Police Station: ప్రముఖ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ స్నేహా పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు వ్యాపారవేత్తలపై చెన్నైలోని కానత్తూర్ పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా సమాచారం ప్రకారం.. చెన్నైలోని ఓ ఎక్స్పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తమ బిజినెస్ కోసం డబ్బు అప్పుగా తీసుకున్నారని, వారికి వడ్డీ కింద 26 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆమె పోలీసులకు తెలిపారు. అయితే ఇప్పుడు వారు తనని మోసం చేశారని, వడ్డీ చెల్లించమని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఆరోపించారు. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్ అలాగే తాను ఇచ్చిన రూ. 26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని స్నేహా తన ఫిర్యాదు పేర్కొన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. తన ఫిర్యాదు మేరకు దీనిపై దర్యాప్తు చేపట్టాలని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్నేహా పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. కాగా స్నేహా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఒకప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా రాణించిన స్నేహా ఆ తర్వాత తన చిరకాల స్నేహితులు, నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంటకు ఒక కుమారుడు, కూమార్తె ఉన్నారు. పెళ్లి తర్వాత స్నేహా పలు వాణిజ్య ప్రకటనలతో పాటు సినిమాల్లో సహాయ నటిగా, హీరోలకు వదిన, అక్క వంటి పాత్రలు చేస్తూ వస్తున్నారు. చదవండి: నయన్‌కు సామ్ బర్త్‌డే విషెస్, లేడీ సూపర్‌స్టార్‌పై ఆసక్తికరంగా పోస్ట్ 46 ఏళ్లకు తల్లైన స్టార్ హీరోయిన్, కవలలకు జననం -
కోటితో ఉడాయించిన వ్యాపారి
దుగ్గొండి(నర్సంపేట): గ్రామాల్లో రైతులను నమ్మించి.. పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. కొంతకాలం పాటు సక్రమంగా డబ్బులు చెల్లించాడు. ఆతర్వాత లక్షలాది రూపాయల సరుకులు విక్రయించిన రైతులను ముంచేశాడు. సుమారు వంద మంది రైతులకు చెందిన రూ.కోటితో ఉడాయించిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన ఈర్ల స్వామి నాలుగేళ్ల క్రితం టాటాఏఎస్ ట్రాలీ నడుపుతూ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేవాడు. ఈ క్రమంలో రైతులతో పరిచయం పెంచుకున్నాడు. మూడేళ్ల క్రితం తానే స్వయంగా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. పత్తి, మొక్కజొన్న, పసుపు, పల్లికాయను రైతుల ఇంటి వద్దే కొనుగోలు చేశాడు. ఇంటి వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో రైతులు అతడికి అన్ని రకాల సరుకులను విక్రయించేవారు. రెండేళ్లపాటు రైతులకు నమ్మకంగా డబ్బులు చెల్లించాడు. ఇలా అతడి వ్యాపారం దుగ్గొండి, గీసుగొండ, చెన్నారావుపేట, నర్సంపేట మండలాల పరిధిలో గ్రామాలకు విస్తరించింది. ఈ ఏడాది పత్తి, పసుపు, మొక్కజొన్న, పల్లికాయను మార్కెట్లో ఉన్న ధర కంటే ఎక్కువ ధరకు వందలాది మంది రైతుల వద్ద సుమారు రూ.కోటి వరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. తీరా డబ్బులు చెల్లించే క్రమంలో అనేక ఇబ్బందులు పెడుతున్నాడు. పది రోజులుగా ఆయా మండలాలకు చెందిన రైతులు స్వామి ఇంటికి వచ్చి చూడగా అందుబాటులో ఉండటం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఈ క్రమంలో శనివారం కూడా వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉండటం చూసిన రైతులు గుమస్తాను వెంట పెట్టుకుని అతడి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆదివారం ఉదయం 87 మంది రైతులను ఈర్ల స్వామి మోసం చేశాడని, రూ.కోటితో ఉడాయించాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు స్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. స్వామి ఉడాయించిన విషయం ఇంకా చాలామంది రైతులకు తెలియదని సుమారుగా రూ.2కోట్లతో ఊడాయించి ఉంటాడని రైతులు చర్చించుకుంటున్నారు. రూ.3.10 లక్షలు రావాల్సి ఉంది.. నా చేలో పండిన 25 క్వింటాళ్ల పసుపు, 16 క్వింటాళ్ల పల్లికాయ, 16 క్వింటాళ్ల పత్తిని స్వామికి విక్రయించాను. 15 రోజులుగా డబ్బుల కోసం ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నాను. మొదట రేపు, మాపు అంటూ నమ్మించాడు. తీరా బతుకమ్మ, సద్దుల పండుగ నుంచి మనిషి కనబడటం లేదు. రూ.3.10 లక్షలు రావాల్సి ఉంది. ఇంటి ముందుకు వచ్చిన కాంటా కదా అని నమ్మి మోసపోయాను.– సిరిపురం వీరమల్లారెడ్డి, రైతు, నాచినపల్లి ఎక్కువ ధర వస్తుందని ఆశ పడ్డ.. నాకు ఒక ఎకరం భూమి ఉంది. మొక్కజొన్న వేసిన. 31 క్వింటాళ్ల మొక్కజొన్నలు పండినవి. పక్క ఊరు కావడంతో స్వామితో కొంత పరిచయం ఉంది. బయట క్వింటాళ్‌కు రూ.1350 ఇస్తున్నరు. ఇక్కడ రూ.1400 పెడుతుండటంతో పాటు ఇంటి వద్దే కాంటా పెట్టిన. 20రోజులైతాంది. రూ.45 వేలు రావాలే.. – గోవిందనాయక్,రైతు, కొమ్మాల, గీసుగొండ మండలం -
దళిత పారిశ్రామికవేత్తలకు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శనివారం రవీంద్రభారతిలో జరిగిన దళిత పారిశ్రామికవేత్తల అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు ఆయన అవార్డులు అందించారు. దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) పలు డిమాండ్లను మంత్రి ముందుంచింది. గతేడాది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంలో భాగంగా రూ.100 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.200 కోట్లకు పెంచామని మంత్రి చెప్పారు. డిక్కి ప్రతిపాదనలపై 15 రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అవార్డులు అందుకున్న వారు.. తయారీరంగం: దాసరి అరుణ, మోక్ష మేరీ, కె.గోవిందరావు, ఎల్.ప్రకాశ్ సేవారంగం: కేవీ స్నేహలత, మంచాల శ్రీకాంత్, పంద సొలొమాన్ వివేక్, ఎన్.వినోద్‌గాంధీ మహిళా పారిశ్రామికవేత్తలు: సుశీల, భుక్యా సరోజిని -
పారిశ్రామికవేత్తలను బలి చేయొద్దు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లాకు బాసటగా పారిశ్రామిక వర్గాలు గళమెత్తాయి. ప్రభుత్వ చర్యలు పెట్టుబడిదారులకు ఇబ్బంది పెట్టేలా ఉన్నాయంటూ ఆరోపించాయి. వ్యాపారవేత్తలపై కేసులు నమోదు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. బొగ్గు కుంభకోణంపై రాజధానిలో రాజకీయ పక్షాల మధ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి వర్గంలోని కొంత మంది మంత్రులు కూడా సీబీఐ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రధానిని మాత్రం వెనకేసుకొచ్చారు. మరోపక్క ప్రధాని రాజీనామాకు బీజేపీ పట్టుబట్టింది. కామన్వెల్త్ గేమ్స్, 2జీ స్కాంలో ఫైల్స్‌పై సంతకాలు చేసినవారిదే బాధ్యత అంటూ అరెస్ట్ చేసిన విధంగానే ప్రధానిపై కూడా కేసు పెట్టాలని బీజేపీ వాదించింది. పరేఖ్ ప్రశ్నకు సమాధానం చెప్పాలని పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. కాగా, ఏవో చిన్న చిన్న అనుమానాలు, వక్రీకరణలపై పారిశ్రామికవేత్తలను బలిపశువులను చేయవద్దని పారిశ్రామిక వర్గాలు కోరాయి. ఇలాంటి వాటి వల్ల ప్రభుత్వానికి, పరిశ్రమ వర్గాలకి మధ్య నమ్మకం సన్నగిల్లుతుందని తెలిపాయి. ఈ పరిణామాలు జాతి మనోభావాలను దెబ్బతీస్తాయని, అంతేగాక ఇటు దేశీయ, అటు విదేశీ పెట్టుబడిదారుల నమ్మకాన్ని వమ్ము చేస్తాయని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనా లాల్ కిద్వాయ్ చెప్పారు. ఇది పెట్టుబడుల వాతావరణాన్ని కలుషితం చేస్తుందన్నారు. గౌరవంగా వ్యాపారాలు చేసేవారిని చిన్న చిన్న కారణాలు చూపించి బలిపశువులు చేయవద్దని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. బిర్లాైపై కేసు నమోదు కావడం పట్ల దేశంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆది గోద్రెజ్ చెప్పారు. ఇప్పటికే వోడాఫోన్ లాంటి కేసుల్లో తీవ్రంగా నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఆర్ధికాభివృద్ధిలో వ్యాపారవేత్తల పాత్ర ఏంటో ప్రభుత్వం తెలుసుకోవాలని కనోరియా కెమికల్స్ సీఎండీ ఆర్వీ కనోరియా అన్నారు. సానుకూల వాతావరణం కల్పిస్తే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. వ్యాపారవర్గాలన్నీ బిర్లాకు బాసటగా నిలుస్తాయని పీెహచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సుమన్ జ్యోతి ఖైతాన్ వెల్లడించారు. బిర్లాపై కేసు నమోదు చేయడం భారత కంపెనీలకు నిరుత్సాహాన్ని కలిగించిందని టెలికమ్యూనికేషన్స్ సీఈవో అరవింద్ బాలి అన్నారు. అజ య్ పిరామల్, ఆసోచామ్ కూడా బిర్లాకు బాసటగా నిలిచాయి. కాగా, ప్రభుత్వ వర్గాలు మన్మోహన్‌ను వెనకేసుకువస్తున్నాయి. తాజాగా బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్ కూడా మన్మోహన్ నిజాయితీపై ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. సుప్రీం ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నందున ఇంతకంటే తానేమీ మాట్లాడడనన్నారు. కాంగ్రెస్ ప్రతినిధి రేణుకా చౌదరి కూడా జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. నిజాలు నిగ్గుతేలేవరకూ ఎవరూ ఒక నిర్ణయానికి రాకూడదని చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపులో ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదని ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి నారాయణసామి అన్నారు. రాష్ట్రాల సిఫార్సుపైనే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు బొగ్గు గనులు కేటాయిస్తారని చెప్పారు. గనులు అందుబాటులో ఉన్న రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులతో కూడిన కమిటీ కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. మరోపక్క హిందాల్కో కార్యాలయంలో రూ.25 కోట్లను ఐటీ విభాగం జప్తు చేసింది. సీబీఐ సోదాల్లో ఈ మొత్తం పట్టుబడిన విష యం తెలిసిందే. ఐటీ చట్టం ప్రకారం ఈ డబ్బును జప్తు చేశామని, విచారణ చేపడతామని ఆ సంస్థ అధికారి చెప్పారు. ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేలా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితుల్ని అస్తవ్యస్థం చేసే పనులను అంగీకరించకూడదు. చాలా ఆందోళనకర పరిస్థితి అయితేనే జుడీషియరీ వ్యవస్థ కల్పించుకోవాలి. - వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనపుడు ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని కూడా ఇవి వమ్ము చేస్తాయి. - కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పెలైట్ కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. స్టేటస్ రిపోర్టులో సుప్రీంకు కావాల్సిన సమాచారాన్ని సమకూర్చి నెలాఖరులో సమర్పిస్తాం. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వా త అందిన సమాచారంతో ఎఫ్ఐఆర్ను సమర్పించాం. తదుపరి విచారణలో ఇతర అంశాలను సేకరిస్తాం. - సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా పరేఖ్‌పై సీబీఐ కేసు నమోదు చేయడం పూర్తిగా అన్యాయం, అసంబద్ధం. పరిధులను అతిక్రమిస్తున్న సీబీఐ చర్యల్ని ఖండిస్తున్నా. పరేఖ్ నిజాయితీ పరుడైన అధికారి, - మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎన్. విఠల్ పరేఖ్‌తో ముఖాముఖి పరిచయం లేకపోయినా.. ఆయనో నిజాయితీ పరుడైన అధికారి అని విన్నా. తుది నిర్ణయం తీసుకున్న పీఎంవో, ప్రధానిపై కూడా కేసులు నమోదు చేయడం సరైందే. -మాజీ ఐఏఎస్ జి.సుందరం నవీన్‌ను ప్రశ్నించనున్న సీబీఐ బొగ్గు గనుల కుంభకోణంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ప్రశ్నించడానికి సీబీఐ సిద్ధమవుతోంది. హిందాల్కో సంస్థకు గనులు కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖకు 2005లో రాసిన లేఖపై ఆరా తీసే అవకాశం ఉంది. గనుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై పత్రాలు పరిశీలిస్తున్న సమయంలో నవీన్ పట్నాయక్ రాసిన లేఖ లభ్యమైందని సీబీఐ వర్గాలు చెప్పాయి. తలాబిర-2వ గనికి సంబంధించి తిరస్కరించిన హిందాల్కో దరఖాస్తును పునఃపరిశీలించాల్సిందిగా ఆలేఖలో నవీన్ కోరారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.