
స్నేహ రిటర్న్స్!
గతేడాది ఆగస్టులో విహాన్ (కుమారుడు)కి జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చారు స్నేహ.
గతేడాది ఆగస్టులో విహాన్ (కుమారుడు)కి జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చారు స్నేహ. ఇప్పుడు మమ్ముట్టి హీరోగా నటించనున్న ఓ మలయాళ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నారట. ఫ్యామిలీ డ్రామా కమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మమ్ముట్టి భార్యగా స్నేహ కనిపిస్తారని సమాచారం. ఈ పాత్రకు నయనతారతో పాటు పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. స్నేహ మాత్రమే ఫర్ఫెక్ట్‌గా సూటవుతారని ఆమెను సంప్రదించారు. అయితే.. అబ్బాయి మరీ చిన్నపిల్లాడు కావడంతో సినిమాలో నటించాలా? వద్దా? అని ఆలోచించిన స్నేహ కథ విన్న తర్వాత సంతకం చేశారట. ఈ నెలాఖరున ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.