పెళ్లి తర్వాత మొదటి సినిమా! | Sneha-Prasanna first film together after marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి తర్వాత మొదటి సినిమా!

Published Tue, Aug 20 2013 12:25 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

పెళ్లి తర్వాత మొదటి సినిమా!

పెళ్లి తర్వాత మొదటి సినిమా!

 హోమ్లీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ హీరో ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘అచ్చముండు అచ్చముండు’.  ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే ప్రసన్న, స్నేహల మధ్య ప్రేమ చిగురించింది. 
 
 పెద్దలు ససేమిరా అన్నప్పటికీ ఎలాగోలా ఒప్పించి, ఈ ఇద్దరూ ఒకింటి వారయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టలేదు స్నేహ. తనకు నప్పేట్లు హోమ్లీ కేరక్టర్స్‌ని అంగీకరిస్తున్నారామె. కాగా... పెళ్లి తర్వాత ప్రసన్న, స్నేహల కాంబినేషన్‌లో సినిమా చేయాలని కొంతమంది దర్శక, నిర్మాతలు భావించారట. కానీ, ఈ ఇద్దరూ ఇప్పటివరకు తిరస్కరించుకుంటూ వచ్చారని సమాచారం. 
 
 అయితే ఇటీవల ఓ సిని మాలో కలిసి నటించడానికి అంగీకరించారట. ఈ చిత్రానికి అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వం వహించబోతున్నారని వినికిడి. ప్రసన్న, స్నేహ కాంబినేషన్‌లో రూపొందిన ‘అచ్చముండు అచ్చముండు’ చిత్రానికి దర్శకత్వం వహించింది అరుణే. ఆయన చెప్పిన కథ నచ్చి, తాజా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ దంపతులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement