సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి స్నేహ పడమట శుభారంభం చేసింది. ఇండోనేసియాలోని బాలిక్‌పపాన్ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో స్నేహ 6-3, 1-6, 6-4తో లెహ్ డా (ఆస్ట్రేలియా)ను ఓడించింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టిన స్నేహ రెండో సెట్‌లో తడబడినా నిర్ణాయక సెట్‌లో పైచేయి సాధించింది.
గురువారం జరిగే రెండో రౌండ్‌లో నాలుగో సీడ్ బార్బరా బోనిక్ (సెర్బియా)తో స్నేహ తలపడుతుంది. ఇదే టోర్నీలో ఆడుతోన్న ఇతర భారత క్రీడాకారిణులు అంకిత రైనా, నటాషా పల్హా కూడా ముందంజ వేశారు. టాప్ సీడ్ అంకిత రైనా 7-5, 6-2తో షర్మదా బాలూ (భారత్)పై, నటాషా 6-2, 6-3తో ఎబ్బీ మైయెర్స్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు.
రెండో రౌండ్‌లో స్నేహ
Published Thu, May 29 2014 12:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement