సెమీస్‌లో విఘ్నేశ్-వినాయక్ జోడి | vignesh ,vinayak entered in semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో విఘ్నేశ్-వినాయక్ జోడి

Published Thu, Mar 20 2014 12:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

vignesh ,vinayak entered in semi finals

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-4 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విఘ్నేశ్-కాజా వినాయక్ శర్మ జోడి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

తిరుచ్చిలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విఘ్నేశ్-వినాయక్ ద్వయం 5-7, 7-6 (10/8), 10-8తో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)-జానిస్ లినిగెర్ (స్విట్జర్లాండ్) జంటపై విజయం సాధించింది. అయితే సింగిల్స్‌లో మాత్రం విఘ్నేశ్, వినాయక్‌లకు ఓటమి ఎదురైంది. రెండో రౌండ్‌లో విఘ్నేశ్ 3-6, 0-6తో జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) చేతిలో... వినాయక్ 2-6, 3-6తో శ్రీరామ్ బాలాజీ (భారత్) చేతిలో ఓటమి చవిచూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement