సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ ఆసియా బి1 చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలోనూ సత్తాచాటింది. బాలికల డబుల్స్‌లో ప్రాంజల జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ ప్రాంజల-ఓజస్విని సింగ్ జోడి 6-2, 6-0తో సిమ్రాన్ కౌర్ (భారత్)- రియా దోషి (సింగపూర్) జంటపై అలవోక విజయం సాధించింది.
అయితే స్నేహ పడమట జోడి నిరాశపరిచింది. థాయ్‌లాండ్‌కు చెందిన మూడో సీడ్ తమచన్ మొంకూంతోద్- ప్లొబ్రంగ్ ప్లిప్యూచ్ ద్వయం 6-2, 6-3తో స్నేహ-సృష్టి స్లారియా (భారత్) జంటపై నెగ్గింది. జెన్నిఫర్ లూకమ్ (భారత్)తో జతకట్టిన ఏపీ అమ్మాయి నిధి సురపనేని జోడి కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నిధి జంట 4-6, 6-4, (12-10)తో సంజన (భారత్)-క్వాన్ యూ (హాంకాంగ్) ద్వయంపై గెలుపొందింది. బాలుర సింగిల్స్‌లో శర్మల్ (శ్రీలంక) 6-3, 6-1తో జ్ఞానభాస్కర్ (భారత్)పై నెగ్గాడు.
క్వార్టర్స్‌లో ప్రాంజల జోడి
Published Wed, Apr 16 2014 12:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement