ఆటిజం కుర్రాడి కథతో ‘మా నాన్న పోలీస్’
ఆటిజం కుర్రాడి కథతో ‘మా నాన్న పోలీస్’
Published Sat, Aug 31 2013 12:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
తమిళంలో ఘనవిజయం సాధించిన ‘హరిదాస్’ చిత్రం తెలుగులో ‘మా నాన్న పోలీస్’గా వస్తోంది. జీఎన్నార్ కుమార్‌వేల్ దర్శకుడు. డా.రామ్ ప్రొడక్షన్స్ పతాకంపై డా.రామ్‌దాస్ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.
కిశోర్, స్నేహ, ప్రదీప్ రావత్ ఇందులో ముఖ్యతారలు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇది చాలా గొప్ప కథ. ఆటిజంతో బాధపడుతున్న కుర్రాడు ఆ లోపాన్ని ఎదురొడ్డి ఎలా విజేతగా నిలిచాడన్నదే ఈ సినిమా నేపథ్యం. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు ప్రపంచం నలుమూలలా ఉన్నారు.
సచిన్ టెండూల్కర్, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తదితరులు ఆటిజంతో బాధపడినవాళ్లే. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కిశోర్, టీచర్‌గా స్నేహ అద్భుతంగా నటించారు. త్వరలో ఈ సినిమా హిందీ, మలయాళంలోకి రీమేక్ అవుతోంది. త్వరలోనే తెలుగు వెర్షన్ విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
Advertisement
Advertisement