haridas
-
బైకులపై ఇంటింటికి వెళ్తున్న హరిదాసులు
-
కళలను పోషిద్దాం
మంత్రాలయం : హిందూ సంస్కృతి, ఆచారాలను సృషించే కళలను పోషించడానికి ప్రతిఒక్కరూ తమ వంతు కృషి చేయాలని శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పిలుపునిచ్చారు. కార్తీక మాసం పురస్కరించుకుని గురుసార్వభౌమ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీమఠంలో హరిదాస సమ్మేళనం ప్రారంభించారు. ముందుగా పీఠాధిపతి జ్యోతులు వెలిగించి కార్యక్రమానికి అంకురార్పణ పలికారు. స్వామీజీ మాట్లాడుతూ దైవ చింతనకు దాస సాహిత్యం ఎంతో దోహద పడుతుందన్నారు. హరికథలు, సంగీత విభావరి, భక్తికీర్తనలు భక్తుల్లో ప్రశాంతతను నెలకొల్పుతాయన్నారు. ప్రతి భక్తుడూ హరిదాసులను ఆదరించాలన్నారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసరావు, సంస్కృత పాఠశాల ఉప కులపతి పంచముఖి, ప్రధానాచార్యులు వాదిరాజాచార్ పాల్గొన్నారు. -
హరిలో రంగ హరి
హరిదాసు అంటే హరి భక్తుడని అర్థం. సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపమే తానుగా ధరించిన హరిదాసు ఆబాల గోపాలుని తన్మయులను చేస్తూ, ఆనందపరుస్తూ తిరుగుతుంటారు. హరిదాసు తలపై ఉన్న నామాలు కలిగిన అక్షయ పాత్ర తరగని సంపదలకు గుర్తుగా భావిస్తారు. త్రిలోక సంచారి అయిన విష్ణుమూర్తి భక్తుడైన నారదులవారే నేటి మన ఈ హరిదాసులుగా గ్రామాలలో ప్రజలు భావిస్తారు. వేకువ జామునుంచే వీధుల్లో శ్రీమద్రమారమణ గోవిందో హరి... హరిలో రంగ హరి... అంటూ వీరు ఆలపించే గీతాలు మన సంస్కృతిని వివరిస్తాయి. రైతుల లోగిళ్లు ధాన్యరాశులతో నిండాలని, రైతులు సుఖసంతోషాలతో వర్ధిలాలని, ఇలాగే ప్రతిఒక్కరూ దానధర్మాలు చేస్తూ చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. మహిళలు. పిల్లలు ఆనందంగా ఎవరికి తోచిన విధంగా వారు విష్ణుమూర్తి అవతారమైన హరిదాసుకు దానధర్మాలు చేస్తుంటారు. రానురాను తగ్గుతున్న ఆదరణ.. మండలంలో రాజుపాలెం గ్రామంలో సుమారు 60 కుటుంబాలకు చెందిన హరిదాసులు జీవనం సాగిస్తున్నారు. గతంలో వీరి కుటుంబాల్లో ఒకటి నుంచి ఐదుగురు చొప్పున సంక్రాంతి నెలలో తిరుగుతుంటారు. రానురాను హరిదాసులకు పల్లెల్లో ఆదరణ తగ్గిపోవడంతో నేడు ఒకరిద్దరే తిరుగుతున్నారు. అందులో గ్రామానికి చెందిన తొట్టెంపూడి నరసింహాదాసు హరిదాసు వేషంలో రోజు చుట్టు ప్రక్కల గ్రామ వీధుల్లో తిరుగుతూ, దేవుని గీతాలు ఆలపిస్తూ సందడి చేస్తారు. -
ఆటిజం కుర్రాడి కథతో ‘మా నాన్న పోలీస్’
తమిళంలో ఘనవిజయం సాధించిన ‘హరిదాస్’ చిత్రం తెలుగులో ‘మా నాన్న పోలీస్’గా వస్తోంది. జీఎన్నార్ కుమార్వేల్ దర్శకుడు. డా.రామ్ ప్రొడక్షన్స్ పతాకంపై డా.రామ్‌దాస్ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. కిశోర్, స్నేహ, ప్రదీప్ రావత్ ఇందులో ముఖ్యతారలు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇది చాలా గొప్ప కథ. ఆటిజంతో బాధపడుతున్న కుర్రాడు ఆ లోపాన్ని ఎదురొడ్డి ఎలా విజేతగా నిలిచాడన్నదే ఈ సినిమా నేపథ్యం. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. సచిన్ టెండూల్కర్, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తదితరులు ఆటిజంతో బాధపడినవాళ్లే. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా కిశోర్, టీచర్‌గా స్నేహ అద్భుతంగా నటించారు. త్వరలో ఈ సినిమా హిందీ, మలయాళంలోకి రీమేక్ అవుతోంది. త్వరలోనే తెలుగు వెర్షన్ విడుదల చేస్తాం’’ అని తెలిపారు.