
సాక్షి, బెంగళూరు: ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడవద్దన్నందుకు యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డబళ్లాపుర పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో ద్వితీయ పీయూసీ చదువుతున్న స్నేహ (18) ఫోన్‌లో ఎక్కువగా అబ్బాయిలతో మాట్లాడుతుండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన స్నేహ వారం క్రితం ఇంట్లో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. తీవ్రఅస్వస్థురాలైన స్నేహను ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక శనివారం ఉదయం మృతి చెందింది.
చదవండి: (ఘోరం: అందరూ చూస్తుండగానే...)