
స్నేహ(ఫైల్)
ఉప్పల్: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోడుప్పల్ అన్నపూర్ణనగర్ కాలనీకి చెందిన సత్యం కుమార్తె ఇంజినీరింగ్ చదువుతోంది. శుక్రవారం స్నేహ (21) శుక్రవారం తన స్నేహితురాలు శృతితో బైక్‌పై అమీర్‌పేట నుంచి బోడుప్పల్‌కు వస్తుండగా ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీ కొనడంతో బైక్ వెనుక కూర్చున్న స్నేహ కిందపడటంతో బస్సు చక్రాలు ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వాహనం నడుపుతున్న శృతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితులు మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సమీప బంధువులని సమాచారం. శృతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment