కపిల్‌తో కాసేపు!
క్రికెట్... సినిమా అనేవి ఇండియాలో రెండు మతాలుగా విరాజిల్లుతూ ఉంటాయి. క్రికెటర్స్‌నీ, సినిమా స్టార్స్‌నీ చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటిది ఓ సీనియర్ క్రికెటర్, ఓ స్టార్ హీరో కలిస్తే.. ఆ ఫ్రేమ్ అదిరిపోతుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌ను స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ కలిశారు. ఆ సందర్భంగా కెమెరా ఫ్రేమ్‌కి ఈ ముగ్గురూ పోజులిచ్చారు.
‘‘ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ కపిల్‌ని కలిశాం. చాలా మంచి వ్యక్తి. ఆయనలో సెన్సాఫ్ హ్యుమర్ ఉంది. హిందీలోకి అనువదించిన దక్షిణాది చిత్రాలను తరచూ చూస్తుంటానని ఆయన అన్నారు’’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అది మాత్రమే కాదు.. అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం’ చిత్రాన్ని కపిల్ ప్రత్యేకంగా అభినందించారట. ఆ అభినందనలు చాలా ఆనందాన్నిచ్చాయని అల్లు అర్జున్ అన్నారు.