
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో సినిమానా? ప్రియురాలా? అన్న పరిస్థితి ఎదురైందట. ఈ రెండింటిలో ఒకటి ఎంచుకుని మరొకరటి వదిలేయక తప్పలేదట. ఈ విషయాన్ని అతడు కచ్చే ధాగే(1999) సినిమా రిలీజ్ సమయంలో వెల్లడించాడు. అందుకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
సైఫ్ తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్తూ.. 'చాలామంది ఎన్నో కష్టాలు పడ్డామని చెప్తుంటారు. నిజానికి కష్టం అంటే ఏంటి? ఒక్క ఛాన్స్ అంటూ పదేపదే ఆడిషన్స్ కోసం తిరగడమా? ఒక ఆఫీసులో మూడు గంటలపాటు ఎదురుచూడటమా? ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఎంతో కష్టపడ్డామంటే అందులో ఇవే ఉంటాయి. కానీ నేను ఎదుర్కొన్న ఇబ్బందులు అదో రకమైనవి. నేను బేఖుడి సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ ఆ డైరెక్టర్ రాహుల్ రావల్ నన్ను ఏమని అడిగాడో తెలుసా?
నీకు సినిమా కావాలా? నీ ప్రియురాలు కావాలా? అన్నాడు. ఏదో ఒకటి మాత్రమే సెలక్ట్ చేసుకోవాలని కండీషన్ పెట్టాడు. నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఎందుకు వదిలేయాలో అర్థం కాలేదు. కుదరదని చెప్పడంతో నన్ను సినిమాలో నుంచి తీసేశారు' అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ దీని గురించి మాట్లాడుతూ.. 'డైరెక్టర్ నాపై వస్తున్న రూమర్స్ నమ్మాడు కానీ నన్ను నమ్మలేదు. నాకు సినిమాల్లో ఆసక్తి లేదని అతడు భావించాడు, అందుకే నాతో కలిసి పని చేయాలనుకోలేదు' అని పేర్కొన్నాడు.
కాగా బాలీవుడ్‌లో హీరోగా నటించిన సైఫ్ ఈమధ్య విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం అతడు పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌లో రావణుడిగా నటిస్తున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ విలన్‌గా కనిపించనున్నాడు.
చదవండి: ఝాన్సీతో విడాకులు, 8 ఏళ్లు కోలుకోలేకపోయా: జోగి నాయుడు
Comments
Please login to add a commentAdd a comment