ది ఫేమస్ పటౌడీ ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ పుకారు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ చెవిలో పడింది. నాకు తెలియకుండా ప్యాలెస్‌ను ఎక్కడ అమ్మేస్తున్నారని సైఫ్ షాకయ్యాడు. తన ఇల్లుకు మనసులో ప్రత్యేక స్థానం ఉందన్నాడు.
మా నాన్న నవాబు
ఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మకంగా చూసుకుంటే ఈ ప్యాలెస్ ఎంతోమందికి చెందినది. మా నాన్న (క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్) నవాబు. ఈ ప్యాలెస్‌లో తనకు నచ్చినట్లు బతికాడు. అయితే కాలం మారుతుండేకొద్దీ నాకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ఇంటిని హోటల్‌కోసం అద్దెకు ఇస్తే ఎలా ఉంటుందనుకున్నాను.
అందుకు ఒప్పుకోలేదు
అందుకు మా నానమ్మ అస్సలు ఒప్పుకోలేదు. ఇలాంటి పిచ్చి పనులు చేయకని మందలించింది. ఈ ఇంటికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అది నేను గర్వంగా ఫీలవుతాను. మా నానమ్మ-తాతయ్య, నాన్న జ్ఞాపకాలతో హౌస్‌ను నింపేయాలనుకున్నాను. నేను అనుకుంది దాదాపు పూర్తి కావొచ్చింది అని పేర్కొన్నాడు.
ప్యాలెస్ హైలైట్స్
పటౌడీ ప్యాలెస్ విషయానికి వస్తే దీన్ని సైఫ్ తాతయ్య ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ నిర్మించాడు. ఇందులోని ప్రతి గది, అలంకరణ వస్తువులు రాజదర్పాన్ని ప్రదర్శిస్తాయి. దాదాపు 10 ఎకరాల్లో విస్తీర్ణమై ఉన్న ఈ ప్యాలెస్‌లో 150 గదులున్నాయి. ప్రస్తుతం దీన్ని సైఫ్ కుటుంబం వెకేషన్ కోసం వాడుతోంది. ఎక్కువగా సినిమా షూటింగ్‌లు జరుగుతూ ఉంటాయి. బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్ కూడా ఈ రాజభవనంలోనే తెరకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment