
దీపక్ తిరోజి.. ఆషిఖి, ఖిలాడీ, జో జీతా వోహి సిఖిందర్, ఘులామ్, బాద్‌షా వంటి హిందీ చిత్రాల్లో సహాయక పాత్రలతో గుర్తింపు పొందాడు. పెహ్లా నషా మూవీతో హీరోగానూ మారాడు. ఊప్స్ చిత్రంతో దర్శకనిర్మాతగా అవతారం ఎత్తాడు. ఆయన చివరగా 2018లో వచ్చిన టామ్, డిక్ అండ్ హ్యారీ 2 అనే సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
అతిథి పాత్రలో
దాదాపు ఆరేళ్ల తర్వాత టిప్సీ చిత్రంతో మరోసారి దర్శకుడిగా మారాడు. ఈ మూవీ మే 10న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన దీపక్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. '1993లో జరిగిందీ సంఘటన.. అప్పుడు నేను పెహ్లా నషా సినిమా చేస్తున్నాను. ఆ మూవీలో అందరు సెలబ్రిటీలు అతిథి పాత్రలో కనిపించాల్సి ఉంది. షారుక్, సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్.. అందరూ ఒప్పుకున్నారు.

చిన్నపాటి సీన్
షూటింగ్ కోసం సైఫ్ ఇంటి దగ్గర రెడీ అవుతున్నప్పుడు అతడి భార్య అమృత (ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది. అందుకాయన దీపక్ సినిమా కోసం వెళ్తున్నాను. చిన్నపాటి సీన్ చేసి వస్తానని చెప్పాడు. అందుకామె ఆశ్చర్యపోతూ నిజంగానే మీరందుకు ఒప్పుకున్నారా? మేమైతే అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు.
నిజానికి ఆ సమయంలో..
ఇలా ఒకరికి సపోర్ట్ చేసేందుకు ఎవరైనా వెళ్తారా? అని ఆగ్రహించింది. నిజానికి ఆ సమయంలో అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు పెద్దగా కనిపించడమే లేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక పెహ్లా నషా సినిమాలో షారుక్, సైఫ్‌తో పాటు రవీనా టండన్, పూజా భట్, పరేశ్ రావల్, జూహీ చావ్లా, సుదేశ్ బెర్రీ ఇలా తదితరులు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment