Deepak Tijori
-
నాకు సపోర్ట్ చేసేందుకు ఆ హీరో భార్య ఒప్పుకోలేదు
దీపక్ తిరోజి.. ఆషిఖి, ఖిలాడీ, జో జీతా వోహి సిఖిందర్, ఘులామ్, బాద్షా వంటి హిందీ చిత్రాల్లో సహాయక పాత్రలతో గుర్తింపు పొందాడు. పెహ్లా నషా మూవీతో హీరోగానూ మారాడు. ఊప్స్ చిత్రంతో దర్శకనిర్మాతగా అవతారం ఎత్తాడు. ఆయన చివరగా 2018లో వచ్చిన టామ్, డిక్ అండ్ హ్యారీ 2 అనే సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు.అతిథి పాత్రలోదాదాపు ఆరేళ్ల తర్వాత టిప్సీ చిత్రంతో మరోసారి దర్శకుడిగా మారాడు. ఈ మూవీ మే 10న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన దీపక్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. '1993లో జరిగిందీ సంఘటన.. అప్పుడు నేను పెహ్లా నషా సినిమా చేస్తున్నాను. ఆ మూవీలో అందరు సెలబ్రిటీలు అతిథి పాత్రలో కనిపించాల్సి ఉంది. షారుక్, సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్.. అందరూ ఒప్పుకున్నారు. చిన్నపాటి సీన్షూటింగ్ కోసం సైఫ్ ఇంటి దగ్గర రెడీ అవుతున్నప్పుడు అతడి భార్య అమృత (ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది. అందుకాయన దీపక్ సినిమా కోసం వెళ్తున్నాను. చిన్నపాటి సీన్ చేసి వస్తానని చెప్పాడు. అందుకామె ఆశ్చర్యపోతూ నిజంగానే మీరందుకు ఒప్పుకున్నారా? మేమైతే అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు. నిజానికి ఆ సమయంలో..ఇలా ఒకరికి సపోర్ట్ చేసేందుకు ఎవరైనా వెళ్తారా? అని ఆగ్రహించింది. నిజానికి ఆ సమయంలో అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు పెద్దగా కనిపించడమే లేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక పెహ్లా నషా సినిమాలో షారుక్, సైఫ్‌తో పాటు రవీనా టండన్, పూజా భట్, పరేశ్ రావల్, జూహీ చావ్లా, సుదేశ్ బెర్రీ ఇలా తదితరులు నటించారు.చదవండి: ఓటీటీలో 100 సినిమాలు.. ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి -
నటుడిని ఇంట్లోంచి గెంటేసిన భార్య!
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు దీపక్ తిజోరి అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చారు. దీపక్ భార్య శివాని తోమర్ ఆయనను ఇంటిని నుంచి బయటకు గెంటేసినట్టు వచ్చినట్టు వార్తలు బాలీవుడ్ లో కలకలం రేపాయి. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆయనను శివాని వెళ్లగొట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన స్నేహితుల ఇళ్లలో లేదా పెయింగ్ గెస్ట్ అకాండేషన్స్ లో ఉంటున్నట్టు సమాచారం. చాలా ఏళ్లుగా కలిసివుంటున్న వీరిద్దరూ అసలు పెళ్లి చేసుకోలేదని వెల్లడైంది. వీరిద్దరికీ 21 ఏళ్ల సమారా అనే కుమార్తె ఉంది. శివాని తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వలేదని, న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో దీపక్ ను పెళ్లి చేసుకోలేదని సమాచారం. కాగా, తమ పోషణకు దీపక్ డబ్బులు ఇవ్వడం లేదని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. శివానికి వ్యతిరేకంగా దీపక్ కేసు వేయడంతో వీరిద్దరి గొడవలు రచ్చకెక్కాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం బాంద్రా కుటుంబ న్యాయస్థానంలో ఉంది. దీపక్ దంపతుల మధ్య కలహాలు ఉన్న మాట వాస్తమేనని శివాని సోదరి, గాయకురాలు కనికాలాల్ ధ్రువీకరించింది. ‘దీపక్ కు సొంత ఇల్లు ఉంది. స్నేహితుల ఇళ్లలో గడపాల్సిన అవసరం ఆయనకు లేదు. దీపక్, శివాని మధ్య విభేదాలున్నాయి. వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేయాలనుకోవడం లేదు. వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోకుండా ఉండడం ఎలా సాధ్యం? ఇదంతా మీడియా కుట్ర. ఆధారాలు లేకుండా ఇలాంటి కథనాలు రాయొద్దని మీడియాను వేడుకుంటున్నా. ఈ వ్యవహారం కోర్టులో ఉంది, తీర్పు కోసం వేచిచూద్దామ’ని కనికాలాల్ పేర్కొంది. -
ఆగస్టు 28న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న సుమన్ (నటుడు), దీపక్ తిజోరి (నటుడు, దర్శకుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది వృత్తికారకుడైన శని సంఖ్య కావడంవల్ల ఈ సంవత్సరం నిరుద్యోగులకు, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడం, రాజకీయ నాయకులకు పదవీ యోగం పట్టడం వంటి శుభపరిణామాలు సంభవిస్తాయి. ఈ సంవత్సరం కష్టపడి సాధించుకున్నది జీవితాంతం అనుభవించే అవకాశం ఉంటుంది. ఆస్తులలో అభివృద్ధి కనిపిస్తుంది. భూ, గృహయోగాలు సిద్ధిస్తాయి. అధికారుల సాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. మధ్యవర్తిత్వాలు, సాక్షి సంతకాలు, హామీ ఉండటాలు, దూకుడు తగ్గించుకోవాలి. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ఈ సంవత్సరం అదృష్టాన్ని పరీక్షించుకోవడం మంచిది. వీరి పుట్టిన తేదీ 28. ఇది సూర్య సంఖ్య కావడం వల్ల స్వతస్సిద్ధంగా వీరికి నాయకత్వ లక్షణాలు, జీవితంలో పైకి రావాలనే కోరిక బలంగా ఉంటాయి. అయితే శనికి, రవికి అంతగా సఖ్యత లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిది. లక్కీ నంబర్స్: 1,5,6,8; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: రోజ్, బ్లూ, ఎల్లో, సిల్వర్, గోల్డెన్. సూచనలు: రుద్రాభిషేకం చేయించుకోవడం, ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం, కాకులకు తీపిపదార్థాలు పెట్టడం, అనాథలకు, వృద్ధులకు సాయం చేయడం, అన్నదానం చేయడం, వృద్ధాశ్రమాలలో శ్రమదానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్