ఆగస్టు 28న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | Celebrities buying a birthday celebration on August 28, | Sakshi
Sakshi News home page

ఆగస్టు 28న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Published Thu, Aug 27 2015 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

ఆగస్టు  28న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఆగస్టు 28న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న సుమన్ (నటుడు), దీపక్ తిజోరి (నటుడు, దర్శకుడు)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది వృత్తికారకుడైన శని సంఖ్య కావడంవల్ల ఈ సంవత్సరం నిరుద్యోగులకు, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడం, రాజకీయ నాయకులకు పదవీ యోగం పట్టడం వంటి  శుభపరిణామాలు సంభవిస్తాయి. ఈ సంవత్సరం కష్టపడి సాధించుకున్నది జీవితాంతం అనుభవించే అవకాశం ఉంటుంది. ఆస్తులలో అభివృద్ధి కనిపిస్తుంది. భూ, గృహయోగాలు సిద్ధిస్తాయి. అధికారుల సాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. 

మధ్యవర్తిత్వాలు, సాక్షి సంతకాలు, హామీ ఉండటాలు, దూకుడు తగ్గించుకోవాలి. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ఈ సంవత్సరం అదృష్టాన్ని పరీక్షించుకోవడం మంచిది. వీరి పుట్టిన తేదీ 28. ఇది సూర్య సంఖ్య కావడం వల్ల స్వతస్సిద్ధంగా వీరికి నాయకత్వ లక్షణాలు, జీవితంలో పైకి రావాలనే కోరిక బలంగా ఉంటాయి. అయితే శనికి, రవికి అంతగా సఖ్యత లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిది.

లక్కీ నంబర్స్: 1,5,6,8; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: రోజ్, బ్లూ, ఎల్లో, సిల్వర్, గోల్డెన్.
 సూచనలు: రుద్రాభిషేకం చేయించుకోవడం, ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం, కాకులకు తీపిపదార్థాలు పెట్టడం, అనాథలకు, వృద్ధులకు సాయం చేయడం, అన్నదానం చేయడం, వృద్ధాశ్రమాలలో శ్రమదానం చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement