
సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలె ఆయన నటించిన విక్రమ్ వేద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధికా ఆప్టేతో కలిసి ఆయన నటించిన చిత్రం త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్‌శర్మ షోలో సందడి చేసిన సైఫ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
సోషల్‌మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నారన్నదానిపై సైఫ్ స్పందిస్తూ... 'ఇప్పటికే నా పేరు మీదు ఎన్నో ఐడీలు ఉన్నాయి. కానీ అందులో నా ఐడీ దొరకలేదు. ఇక సోషల్‌మీడియా అంటేనే చాలా టెన్షన్ ఉంటుంది. చాలా అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనవసరంగా అందరిని పొగడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. అందుకే సోషల్ మీడియాకు దూరంగానే ఉండాలనుకుంటున్నా' అంటూ సైఫ్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment