న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఉండే ఉత్కంఠ, ఉత్సాహమే వేరు. ఈ రెండు దాయాది జట్ల మధ్య ఇన్నేళ్లలో ఎన్నో గొప్ప మ్యాచ్‌లు జరిగాయి. టెస్టులైనా, వన్డేలైనా, టి20లైనా ప్రతీ పోరు ప్రత్యేకమే. మైదానంలో ఇరు జట్ల వైరానికి సంబంధించి ఎన్నో ఘటనలను అభిమానులు ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి ఆసక్తికర ఘటనలు, వ్యాఖ్యలు, వివాదాలతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొత్త డాక్యుమెంటరీని రూపొందించింది. ‘ద గ్రేటెస్ట్ రైవల్‌రీ’ పేరుతో సిద్ధం చేసిన ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 7న ప్రసారం కానుంది.
గ్రే మ్యాటర్ ఎంటర్‌నైట్‌మెంట్ నిర్మించిన ఈ డ్రామాకు చంద్రదేవ్ భగత్, స్టివార్ట్ సగ్ దర్శకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, జావేద్ మియాందాద్, వకార్ యూనిస్, సౌరవ్ గంగూలీ, ఇంజమాముల్ హక్, వీరేంద్ర సెహా్వగ్, షోయబ్ అక్తర్, రవిచంద్రన్ అశి్వన్ ఇంటర్వ్యూలు ఇందులో ఉంటాయి.
‘రెండు దేశాల మధ్య మ్యాచ్‌లలో ఉండే భావోద్వేగాలు, తీవ్రతవంటివి ఇందులో చూపించాం. మీ అంచనాలకు తగ్గకుండా ఉత్కంఠభరితంగా దీనిని రూపొందించాం. మైదానంలో ఆట మాత్రమే కాదు. మైదానం బయట ఎన్నో ఆసక్తికర అంశాలను ఇందులో చూడవచ్చు’ అని రూపకర్తలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment