
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) పాక్‌పై విరాట్ (Virat Kohli) సెంచరీని విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. నిన్న దుబాయ్‌లో దాయాదితో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి బౌండరీ కొట్టి తన సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు భారత్‌ను విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఈ విజయం అనంతరం భారత్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభిమానులు భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
Fans dancing and celebrating Virat Kohli's Hundred & Team India's Win against Pakistan in Mumbai. 🔥🇮🇳 (ANI).pic.twitter.com/Hxg0VCq43Y
— Tanuj Singh (@ImTanujSingh) February 23, 2025
మ్యాచ్ జరిగిన దుబాయ్‌లో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మ్యాచ్ చూడటానికి వచ్చిన సెలబ్రిటీలు సైతం సాధారణ వ్యక్తుల్లా భారత విజయాన్ని ఆస్వాధించారు. కోహ్లి క్రేజ్ ఎల్లలు దాటి పాకిస్తాన్‌కు కూడా పాకింది. పాక్ సిటిజన్లు కోహ్లి తమ సొంత జట్టుపై సెంచరీ చేసినా సెలబ్రేట్ చేసుకున్నారు. కోహ్లి సెంచరీ అనంతరం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోనూ సంబరాలు జరిగాయి.
Crazy scenes in ISLAMABAD! ONLY @imVkohli can do this 🙏🙏🙏🙏pic.twitter.com/reIvbpr9nk
— CricTracker (@Cricketracker) February 23, 2025
కొందరు క్రికెట్ అభిమానులు భారత్, పాక్ మధ్య ఉన్న అంతరాన్ని మరిచి విరాట్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాక్‌పై భారత విజయాన్ని అతి సున్నితమైన కశ్మీర్ ప్రాంతంలోనూ సెలబ్రేట్ చేసుకున్నారు. భారత అభిమానులు రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ బాణాసంచా కాల్చారు. 'భారత్ మాతాకి జై' అన్న నినాదాలతో యావత్ భారత దేశం మార్మోగిపోయింది. కోహ్లి నామస్మరణతో క్రికెట్ ప్రపంచం దద్దరిల్లింది.
CELEBRATIONS IN JAMMU AFTER INDIA'S VICTORY OVER PAKISTAN. 🇮🇳pic.twitter.com/OYLNoYSoE3
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025
కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాక్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ చేసి భారత్‌ను గెలిపించాడు. పాక్ నిర్దేశించిన 242 పరుగుల సాధారణ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. కోహ్లి వన్డేల్లో 51వ సెంచరీతో, ఓవరాల్‌గా 82వ సెంచరీతో మెరిశాడు. భారత్‌ను గెలిపించడంలో శ్రేయస్ అయ్యర్ (56), శుభ్‌మన్ గిల్ (46), కుల్దీప్ యాదవ్ (9-0-40-3), హార్దిక్ పాండ్యా (8-0-31-2) తమవంతు పాత్రలు పోషించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారైంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.