Bigg Boss 8: పాపం.. వచ్చిన 24 గంటల్లోనే ఎలిమినేట్ | Bigg Boss 8 Tamil Sachana Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss Tamil: ఎలిమినేషన్‌లో కొత్త ట్విస్ట్ ఇచ్చిన తమిళ బిగ్‌బాస్

Published Mon, Oct 7 2024 3:59 PM | Last Updated on Mon, Oct 7 2024 4:06 PM

Bigg Boss 8 Tamil Sachana Elimination

ఇప్పటికే బిగ్‌బాస్ 8 తెలుగులో మొదలైపోయింది. ఐదు వారాలు గడిచిపోయాయి. వచ్చిన కంటెస్టెంట్స్‌లో పసలేకపోయేసరికి వైల్డ్ కార్డ్స్ పేరిట మరో ఎనిమిది మందిని తీసుకొచ్చారు. దీని సంగతి పక్కనబెడితే తమిళంలోనే తాజాగా (అక్టోబర్ 6) బిగ్‌బాస్ 8వ సీజన్ మొదలైంది. ఈసారి విజయ్ సేతుపతి హోస్ట్. అయితే వచ్చిన 24 గంటల్లోనే ఎలిమినేషన్ అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

తమిళం గత సీజన్ వరకు కమల్‌హాసన్ హోస్ట్‪‌గా ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈసారి తప్పుకొన్నాడు. దీంతో విజయ్ సేతుపతి కొత్త హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. షో మొదలై ఒకరోజే అయింది కాబట్టి ఇప్పుడే హోస్టింగ్ గురించి ఇంకా ఏం చెప్పలేం. కానీ ఈసారి షో మొదలైన 24 గంటల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పి బాంబ్ పేల్చాడు.

(ఇదీ చదవండి: చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)

తాజాగా తమిళ బిగ్ బాస్ తొలిరోజు ప్రోమోలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది చూపించారు. 'మహారాజ' సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటించిన సచన అనే అమ్మాయి ఈసారి హౌసులోకి వచ్చింది. ఆమెనే ఇప్పుడు ఎలిమినేట్ చేసినట్లు చూపించారు. కనీసం వారమైనా అయితే కదా ఎవరు ఎలా ఫెర్ఫార్మ్ చేశారు? ఎలిమినేట్ చేయడానికి కారణాలైనా కనిపిస్తాయి. ఇలాంటివి ఏం లేకుండా ఈ ఎలిమినేషన్ ఎందుకో? బిగ్‪‌బాస్ తలతిక్క నిర్ణయం వెనక మరేదైనా మతలబు ఉందా అనేది చూడాలి?

ఇక తమిళ బిగ్‌బాస్ 8లోకి వచ్చిన వాళ్లలో నటి మహాలక్షి భర్త రవీందర్ ఒకడు. రెండేళ్ల క్రితం వీళ్ల పెళ్లి సెన్సేషన్ అయిపోయింది. ఇతడితో పాటు దర్శ గుప్తా, సత్య, దీపక్, ఆర్జే అనంతి, సునీతో గోగోయ్, జెఫ్రీ, రంజిత్, పవిత్ర జనని, సౌందర్య, అరుణ్ ప్రసాద్, తర్షిక, వీజే విశాల్, అన్షిదా, అర్ణవ్, ముత్తుకుమార, జాక్వెలిన్ హౌసులోకి వచ్చారు. వీళ్లలో చాలామంది టీవీ నటులే ఉండటం విశేషం.

(ఇదీ చదవండి: జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement