
విజయ్ సేతుపతి ఓ నటుడు. నటుడు అని ఇంతలా ఎందుకు చెబుతున్నామంటే.. రొటీన్ రొట్టకొట్టుడు మూవీస్ కాకుండా హీరో, విలన్ తదితర పాత్రలు చేస్తూ మెప్పిస్తుంటాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న 50వ సినిమా 'మహారాజా'. సుదన్ సుందరం, జగదీష్ పళనిస్వామి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అజనీష్ లోకనాథ్ సంగీతమందించాడు. ఈనెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ట్రైలర్ విడుదల చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)
ఈ మూవీలో విజయ్‌సేతుపతి.. ఓ సెలూన్ షాప్ ఓనర్. ఓసారి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి తన లక్ష్మి కనిపించకుండా పోయిందని, ఎఫ్‌ఐఆర్ రాసి దాన్ని వెతికి పట్టుకోవాలని చెబుతాడు. ఇంతకీ కనిపించకుండా పోయిన లక్ష్మి ఎవరనేదే సస్పెన్స్. అయితే ఇందులో సేతుపతి ఫుల్ డీ గ్లామర్ లుక్‌తో కనిపించాడు. ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరో వారం ఆగితే సరి!
(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‍ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే)
Comments
Please login to add a commentAdd a comment