
తమిళనాడులో నేడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోలీవుడ్ ప్రముఖ హీరోలు క్యూ కట్టారు. సెలబ్రిటీలతో పాటుగా సామాన్య ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా క్యూలలో నిలబడి తమ ప్రజాస్వామిక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, తలపతి విజయ్, నటుడు ధనుష్, నటుడు విక్రమ్ వంటి ప్రముఖులు చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విదేశాల్లో ఉన్న విజయ్ కూడా ఈరోజు తమిళనాడుకు వచ్చి ఓటు వేశారు. చేతికి చిన్న గాయంతో కనిపించిన విజయ్ వచ్చే 2026 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
ఈ సందర్భంలో కోలివుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు, వీల్ చైర్‌లో నడవలేని ఒక వృద్ధురాలు ఆయన్ను సెల్ఫీ కోరింది. విజయ్ నటన అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. మంచి భవిష్యత్ ఉన్న నటుడు అని ఆమె కొనియాడింది. దీంతో వెంటనే విజయ్ సేతుపతి ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకుని ఆ వృద్ధురాలితో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశాడు. ఆమె తల్లి లాంటి వ్యక్తి కావడంతో కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ సమయంలో చాలామంది అభిమానులు ఆయనతో కరచాలనం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
This Is Why He Is Makkal Selvan #VijaySethupathi 🥹❤️pic.twitter.com/txOW6vF731
— Kolly Corner (@kollycorner) April 19, 2024