
దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ సందర్భాల్లో భారీ చిత్రాలు తెరపైకి వస్తుంటాయి. అదే విధంగా ఈ దీపావళికి తమిళంలో పాంచ్ పటాక్‌గా ఐదు చిత్రాలు బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. వాటిలో విడుదలై– 2 చిత్రం ఒకటని తెలుస్తోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో హాస్యనటుడు సూరి కథానాయకుడిగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన చిత్రం విడుదలై. గతేడాది మార్చి 21న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

తాజాగా దీనికి సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో విజయ్ సేతుపతి పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీని ఇన్ఫోటెయిన్‌మెంట్ పతాకంపై ఎల్‌రెడ్.కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ఇకపోతే ఇదే దీపావళికి మరో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అందులో అజిత్ కథానాయకుడిగా నటించిన విడాముయర్చి, సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రాలతో పాటు, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఎల్‌ఐసీ, కవిన్ హీరోగా నటిస్తున్న కిస్ చిత్రాలు దీపావళి రేసుకు సిద్ధం అవుతున్నాయని సమాచారం. మరి అప్పటివరకు వీటిలో ఏది బరిలో ఉంటుందో, ఏది తప్పుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment