దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్'.. ఇప్పటికే తెలుగులో సీజన్-8 ప్రారంభమైంది. అక్టోబర్ 6 నుంచి తమిళ్‌లో సీజన్-8 మొదలుకానుంది. అయితే, ఇప్పటి వరకు హోస్ట్‌గా ఉన్న కమల్ హాసన్ ఈ సీజన్‌కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఈసారి విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిన్న టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ కోసం విజయ్ సేతుపతి ఎంత రెమ్యునరేషన్ తీసుకోనున్నారని పెద్ద చర్చే జరుగుతుంది.
విజయ్ సేతుపతి ఇటీవలే మహారాజ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. సుమారు రూ.120 కోట్లకు పైగా ఈ చిత్రం కలెక్షన్లు రాబట్టింది. దీంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఆయన మార్కెట్ కూడా పెరిగింది. ఈ విజయం తర్వాత బిగ్‍బాస్ తమిళ్ 8వ సీజన్ హోస్టింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 100 రోజుల పాటు సాగే ఈ బిగ్ బాస్ సీజన్‌కు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. ప్రతి శనివారం, ఆదివారం మాత్రమే ఆయన బిగ్‌బాస్‌లో కనిపిస్తారు. అందుకుగాను సుమారు రూ. 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది.
విజయ్ సేతుపతి ఒక్కో సినిమాకు రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వరకు తీసుకుంటారు. ఏదైనా ఒక యాడ్‌లో నటిస్తే రూ. 1కోటి వరకు ఛార్జ్ చేస్తారని టాక్. బిగ్‌బాస్ స్ట్రీమింగ్ అవుతున్న సమయంలో చాలా యాడ్స్ వస్తుంటాయి. అలా చూస్తే విజయ్ సేతుపతికి ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువే అని చెప్పవచ్చు. సేతుపతి మంచి నటుడే కాదు మంచి వక్త కూడా. బిగ్ బాస్ షోకి హోస్ట్ గా ఆయన ఎంపిక పర్ఫెక్ట్ అని అంటున్నారు అభిమానులు. మక్కల్ సెల్వన్ తదుపరి సీజన్‌లకు కూడా వ్యాఖ్యాతగా కొనసాగుతాడని, భవిష్యత్తులో రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కమల్ హాసన్ బిగ్‌బాస్ కోసం రూ. 120 కోట్ల వరకు రెమ్యునరేషన తీసుకునే వారని ప్రచారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment