
తమిళ బిగ్‌బాస్ 8వ సీజన్ అంగరంగ వైభవంగా మొదలైంది

గత ఏడు సీజన్లు కమల్ హాసన్ హోస్ట్‌గా అదరగొట్టేశాడు

వ్యక్తిగత కారణాలతో ఈసారి హోస్టింగ్ నుంచి తప్పుకొన్నారు

దీంతో కొత్త హోస్ట్‌గా విజయ్ సేతుపతి ఎంట్రీ ఇచ్చాడు

ఆదివారం (అక్టోబరు 06) గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది

14, 16 కాదు.. ఏకంగా 18 మందిని హౌసులోకి తీసుకొచ్చారు

వీళ్లలో నిర్మాత రవీందర్, నటి సచన తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయం

చాలా లావుగా ఉండే రవీందర్ నిర్మాతగా పలు సీరియల్స్, సినిమాలు తీశారు

రెండేళ్ల క్రితం నటి మహాలక్ష‍్మిని పెళ్లి చేసుకున్న తర్వాత పలు విమర్శలు ఎదుర్కొన్నారు

ఇక విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమాలో చైల్ట్ ఆర్టిస్టుగా సచన నటించింది

వీళ్లిద్దరు తప్పితే మిగిలిన వాళ్లు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు

ఎన్నడూ లేని విధంగా షో మొదలైన 24 గంటల్లో తొలి ఎలిమినేషన్ చేశారు

నటి సచనని ఎలిమినేట్ చేసి, హౌస్ నుంచి బయటకొచ్చినట్లు చూపించారు

మరి ఇది నిజమా? మరేదైనా ట్విస్ట్ ఉందా అనేది చూడాలి

ఇకపోతే తెలుగులో ఇప్పటికే ఐదు వారాలు అయిపోయాయి. కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు

ఈపాటికే ఐదుగురు ఎలిమినేట్ కాగా.. కొత్తగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు






