మమతా మోహన్‌దాస్, అభిరామి, విజయ్ సేతుపతి
‘‘మహారాజ’ నా కెరీర్‌లో 50వ సినిమా. ఈ మూవీ విజయంపై చాలా నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది. థియేటర్స్‌కి వచ్చి చూడండి’’ అని విజయ్ సేతుపతి అన్నారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహారాజ’. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామి ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది.
ఈ మూవీని ఏపీ, తెలంగాణలో ఎన్ వీఆర్ సినిమా విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘మహారాజ’ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో కొంత గ్యాప్ తర్వాత నేను చేసిన సినిమా ‘మహారాజ’. విజయ్ సేతుపతిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు’’ అన్నారు.
‘‘విజయ్‌గారి 50వ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు నితిలన్ సామినాథన్ . ‘‘మహారాజ’ లో మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. విజయ్‌గారి నట విశ్వరూపం చూస్తారు’’ అన్నారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. ఈ కార్యక్రమంలో నటి అభిరామి, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment