రిలయన్స్‌ ఫౌండేషన్‌ : పిల్లలకోసం మళ్లీ ‘కహానీ కాలా ఖుషీ’ | Childrens Day Reliance Foundation kick starts its annual initiative Kahani Kala Khushi | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ ఫౌండేషన్‌ : పిల్లలకోసం మళ్లీ ‘కహానీ కాలా ఖుషీ’

Published Fri, Nov 15 2024 4:23 PM | Last Updated on Fri, Nov 15 2024 4:23 PM

Childrens Day Reliance Foundation kick starts its annual initiative Kahani Kala Khushi

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని   రిలయన్స్ ఫౌండేషన్‌  తన వార్షిక  పథకాన్ని తిరిగి  లాంచ్‌ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న బాలలకుసాయం అందించేలా ‘ కహానీ కాలా ఖుషీ’  తిరిగిలాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా  రాబోయే కొద్ది వారాలలో భారతదేశం అంతటా కథలు చెప్పడం, ఇతర కార్యకలాపాల ద్వారా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దాదాపు 22వేలమంది పిల్లలకు లబ్ది చేకూరనుంది.

ఈ కార్యక్రమంలో రిలయన్స్ వ్యాపారాల్లోని ఉద్యోగి వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, సంఘాలు వెనుకబడిన నేపథ్యాల పిల్లలతో నిమగ్నమై ఉంటారు. గురువారం ముంబైలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 400 మంది రిలయన్స్ ఉద్యోగులు స్వచ్ఛందంగా 3,800 మంది పిల్లలను కథలు, కళలు, అవుట్‌డోర్ , ఇండోర్ గేమ్‌లు నిర్వహించి పిల్లలతో గడిపారు. రాబోయే రోజుల్లో, దేశవ్యాప్తంగా వందలాది మంది వాలంటీర్లు పిల్లలతో పాలుపంచుకుంటారు. మహారాష్ట్ర, తెలంగాణలో, ప్రీ-స్కూల్ పిల్లల కోసం 63 అంగన్‌వాడీలలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని వెల్లడించింది

నవంబర్ 14-16 మధ్య  1,100 కంటే ఎక్కువ అంగన్‌వాడీలలో 18 వేల మంది పిల్లలను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. కహానీ కలా ఖుషి కార్యక్రమం పిల్లలలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు , విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం 25 నగరాల్లో 17,000 మంది పిల్లలకు చేరువైందని రిలయన్స్ ఫౌండేషన్   ఒక ప్రకటనలో తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement